Asianet News TeluguAsianet News Telugu

‘హిట్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

నేచురల్ స్టార్ నాని సమర్ఫణలో యంగ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘హిట్ 2’ (Hit 2). చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయబోతున్నారు.. చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ అగ్ర దర్శకుడిని ఆహ్వానించడం ప్రత్యేకతగా మారింది.
 

Grand arrangements for Hit 2 movie pre release event, Do you know who the chief guest is?
Author
First Published Nov 27, 2022, 5:11 PM IST

యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మోస్ట్ అవైటెడ్ సిరీస్ లలో ఒకటిగా ఉన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలనూ కూడా పూర్తి చేసుకుంది. అడివి శేష్, నాని, చిత్ర యూనిట్ మూవీని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన డిటేయిల్స్ ఇంట్రెస్టింగా ఉన్నాయి.

హిట్ 2  ప్రమోషన్స్ లో భాగంగా  రేపు హైదరాబాద్ లోనే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు మేకర్స్. ఇందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ‘హిట్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ప్రైడ్ ఆప్ ఇండియన్ సినిమా, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)ని ఆహ్వానించారు. దీంతో సినిమాకు మరింత రీచ్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈవెంట్ ను విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

హీరో అడివి శేష్ - మీనాక్షి చౌదరి జంటగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై మేకర్స్ ఆసక్తిని పెంచుతున్నారు. నేచరల్ స్టార్ నాని (Nani) సమర్పిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ను యువ దర్శకుడు శైలేశ్ కొలను డైరెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ కేస్ కంటే రెండు కేస్ లో మరింత వైలెన్స్ ఉంటుందని  ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక ‘హిట్ వెర్స్’నూ పరిచయం చేస్తూ మరింత ఆసక్తి పెంచారు. డిసెంబర్ 2న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios