Asianet News TeluguAsianet News Telugu

#Magic:'జెర్సీ' డైరక్టర్ కొత్త సినిమా ఎనౌన్సమెంట్, స్టోరీ లైన్ ఇదే

 ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నాగ‌వంశీ నిర్మిస్తుండ‌గా.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించ‌నున్నాడు.

Gowtham Tinnanuri Magic to hit theatres for Summer 2024 jsp
Author
First Published Jan 29, 2024, 12:22 PM IST


టాలీవుడ్ మెల్లిమెల్లిగా మారుతోంది.  కొత్త తరహా చిత్రాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది . ముఖ్యంగా  యంగ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ ఈ టైపు చేయడానికి చూపిస్తున్నారు ఇంతకుముందు హై స్కూల్ మ్యూజికల్స్ వంటి సినిమాలు మనకి రాలేదు కానీ ఇప్పుడు అటువంటి సినిమాకి తెలుగులో స్వాగతం పలుకుతున్నారు.  జెర్సీ  వంటి  స్పోర్ట్స్ డ్రామా సినిమాతో పాపులర్ అయిన  డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు ఓ సెన్సిబుల్ టీనేజ్ డ్రామా మొత్తం ముందుకు వస్తున్నారు.  దాని పేరు మ్యాజిక్.  ఇందులో చాలామంది కొత్తవాళ్లు నటిస్తున్నారు.  ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.

 ఓ నలుగురు తమ కాలేజ్ యానివర్సరీ ఈవెంట్ కు ఓ సాంగ్ ని కంపోజ్ చేయడంలో ఉండే  ఇబ్బందులు ఉత్సాహం సంతోషం ఆటలు ఆనందాలు వీటితో కలిపిన మిక్చర్ లా ఉండబోతుంది.  మరి మ్యూజికల్స్ అనగానే అందుకు తగ్గ పాటలు అందించే మ్యూజిక్ డైరెక్టర్ కావాలి కదా.  తమిళ్ లో  సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిచిన అనిరుద్ ని మించిన వాళ్ళు ఎవరుంటారు. 

ఇక  జెర్సీ వచ్చి 5 సంవ‌త్స‌రాలు అయిన గౌత‌మ్ నుంచి ఇంకో సినిమా రాలేదు. గ‌త ఏడాది టాలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దేవరకొండతో గౌత‌మ్ VD12 అంటూ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్ప‌టివ‌ర‌కు పట్టాలెక్కలేదు. ఒకవైపు విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ మ‌రింత ఆలస్యం అవుతుంది. అయితే ఈ గ్యాప్‌లో గౌత‌మ్ తిన్న‌నూరి త‌న తాజా ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. త‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే నెక్స్ట్ మూవీ మ్యాజిక్ అంటూ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశాడు. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. 

ఇక ఈ ఫ‌స్ట్ లుక్ గ‌మ‌నిస్తే.. సంగీతం నేపథ్యంలో ఈ సినిమా రానుండగా కొత్త నటి నటులతో ఈ సినిమా తీయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నాగ‌వంశీ నిర్మిస్తుండ‌గా.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించ‌నున్నాడు. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో 2024 స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios