Asianet News TeluguAsianet News Telugu

ప్రమాదంలో సల్మాన్ ఖాన్.. మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్.. సెక్యూరిటీ పెంచిన ప్రభుత్వం

ఉగ్రవాదుల ముప్పు ఉండటంతో పలువురు బాలీవుడ్ ప్రముఖ హీరోలకు సెక్యూరిటీ పెంచింది మహరాష్ట్ర సర్కార్. ముఖ్యంగా అత్యంత ప్రమాదంలో ఉన్నందున బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని అప్ గ్రేడ్ చేసింది. 
 

Government Upgrades Salman Khan Security To Y category Following Threats
Author
First Published Nov 2, 2022, 3:22 PM IST

పలువురు బాలీవుడ్ ప్రముఖులకు మహారాష్ట్ర  ప్రభుత్వం భద్రతను పెంచినట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచి ప్రమాదంలో ఉన్న  సల్మాన్ ఖాన్ తో పాటుగా స్టార్ హీరో  అక్షయ్ కుమార్, క్యారెక్టర్ ఆర్టిస్ట్  అనుపమ్ ఖేర్ తదితరులు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇందులో అత్యంత ప్రమాదంలో ఉన్న  సల్మాన్ ఖాన్ కు ఇప్పటికే సాధారణ పోలీస్ బద్రత ఉండగా.. దాన్ని అప్ గ్రేడ్ చేస్తూ.. గన్స్ తో కూడిన వై కాటగిరి సెక్యూరిటీని పెంచింది సర్కారు. 

సల్మాన్ ఖాన్ గతంతో  గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు నుంచి లోగడ బెదిరింపులు ఎదుర్కొన్నారు. సల్మాన్ ఖాన్ తోపాటు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ కు ఈ ఏడాది జూన్ లో బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టించింది. దాంతో అప్పటి నుంచి సల్మాన్ కలలికలపై నిఘ ఉంచారు పోలీసులు. ఆయనకు ఎటువైపు నుంచి అయినా ప్రమాదం జరగొచ్చు అన్న సమాచారంతో బద్రతను పెంచుతూ కట్టదిట్టం చేశారు. 

బిష్ణోయ్ ముఠానే  పంజాబీ యువ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడింది . అనంతరం ముంబై పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని పలువురుని అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ తమ టార్గెట్ అని  పోలీస్ విచారణంలో వాళ్లు  వెల్లడించినట్టు తెలిసింది. దీంతో సల్మాన్ ఖాన్ కు ప్రమాదం పొంచి ఉండటంతో.. ప్రస్తుతమున్న భద్రతను పెంచి, వై ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆయనకు సాధారణ పోలీసు రక్షణ మాత్రమే ఉంది. వై ప్లస్ కేటగిరీలో ఆయుధాలు ధరించిన నలుగురు ఎప్పుడూ సల్మాన్ ను కాచుకుని ఉంటారు.

సల్మాన్ ఖాన్ తో పాటు మరికొంత మంద బాలీవుడ్ హీరోలకు కూడా ప్రమాదం పొంచి ఉంది అని నిఘవర్గాల సమాచారంతో  స్టార్ హీరో  అక్షయ్ కుమార్,  తో పాటు అనుపమ్ ఖేర్ లకు ఎక్స్ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎక్స్ కేటగిరీ రక్షణలో ముగ్గురు సాయుధ పోలీసులు ఎప్పుడూ రక్షణగా ఉంటారు.ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నారు సల్మాన్.. పూజా హెగ్డే హీరోయిన్ గా  కబీ ఈద్ కబీ దివాళి మూవీలో నటిస్తున్నాడు సల్మాన్ . ఈ మధ్య డెంగీ ఫీవర్ బారిన పడిన సల్మన్ రీసెంట్ గా కోలుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios