Asianet News TeluguAsianet News Telugu

ద్యావుడా.. గోపీచంద్ సినిమా కూడా డైరక్ట్ ఓటీటీలోకే!

గత కొన్ని రోజులుగా ఓటీటీల్లో వ‌రుస‌గా కొత్త సినిమాలు రిలీజ‌వుతున్నాయి. క్రిందట నెల చివ‌ర్లో జ్యోతిక త‌మిళ‌ సినిమా పొన్ మ‌గ‌ల్ వందాల్ రిలీజ్ కాగా.. మొన్న శుక్ర‌వార‌మే హిందీ మూవీ గులాబో సితాబోను విడుద‌ల చేశారు. 19న కీర్తి సురేష్ మూవీ పెంగ్విన్ రానుంది. కన్నడ సినిమాలు ‘లా’, ‘ఫ్రెంచ్ బిరియాని’ మ‌ల‌యాళ చిత్రం ‘సుఫియుం సుజాతయుం’, హిందీ మూవీ ‘శకుంతలా దేవి’ కూడా త్వ‌ర‌లోనే అమేజాన్ ప్రైంలోకి రానున్నాయి. ఈ క్రమంలో మరిన్ని సినిమాలు ఓటీటివైపు చూస్తున్నాయి.
 

Gopichand starrer Aaradugula Bullet direct Ott
Author
Hyderabad, First Published Jun 16, 2020, 10:07 AM IST

గత కొన్ని రోజులుగా ఓటీటీల్లో వ‌రుస‌గా కొత్త సినిమాలు రిలీజ‌వుతున్నాయి. క్రిందట నెల చివ‌ర్లో జ్యోతిక త‌మిళ‌ సినిమా పొన్ మ‌గ‌ల్ వందాల్ రిలీజ్ కాగా.. మొన్న శుక్ర‌వార‌మే హిందీ మూవీ గులాబో సితాబోను విడుద‌ల చేశారు. 19న కీర్తి సురేష్ మూవీ పెంగ్విన్ రానుంది. కన్నడ సినిమాలు ‘లా’, ‘ఫ్రెంచ్ బిరియాని’ మ‌ల‌యాళ చిత్రం ‘సుఫియుం సుజాతయుం’, హిందీ మూవీ ‘శకుంతలా దేవి’ కూడా త్వ‌ర‌లోనే అమేజాన్ ప్రైంలోకి రానున్నాయి. ఈ క్రమంలో మరిన్ని సినిమాలు ఓటీటివైపు చూస్తున్నాయి.

తెలుగులో ఈ డైరక్ట్ ఓటీటి సంస్కృతికి తెర తీస్తూ "అమృతారామమ్" అనే సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా ఓటీటీలోకి వచ్చింది. త్వరలోనే "47-డేస్" అనే మరో సినిమా కూడా డైరక్ట్  ఓటీటీలోకి వస్తోంది. నవీన్ చంద్ర మరో సినిమా కూడా అదే పరిస్దితి.  దీంతో పాటుగా స‌త్య‌దేవ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఉగ్ర‌రూప‌స్య చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్‌లోకి తేవ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ విష‌యాన్ని అధికారికంగానే ప్ర‌క‌టించారు.అయితే పెద్ద హీరోలెవరూ ఈ ఓటీటి లిస్ట్ లో చేరటానికి ఇంట్రస్ట్ చూపలేదు. కానీ తాజాగా ఈ లిస్ట్ లో తొలిసారిగా ఓ పెద్ద హీరో సినిమా చేరబోతోంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు గోపీచంద్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉంది.

మీకు గుర్తుందో లేదో కానీ గోపిచంద్ ..మూడేళ్ల కిందట "ఆరడుగుల బుల్లెట్" అనే సినిమా చేశాడు . నయనతార  హీరోయిన్, బి గోపాల్ డైరక్టర్. కానీ ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం ఓటీటీలో సినిమాలకు మంచి రేటు పలుకుతున్న కారణంగా ఈ "బుల్లెట్"ను బయిటపడేయాలని  నిర్ణయించుకున్నాడట నిర్మాత తాండ్ర రమేష్. ఈ మేరకు ప్రస్తుతం పలు ఓటీటీలతో నిర్మాత సంప్రదింపులు జరుపుతున్నాడు. త్వరలోనే ఎక్కడో చోట ఫైనలైజ్ అయ్యి..ప్రకటన రానుంది.  మాస్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరున్న బి. గోపాల్ రూపొందించిన మూవీ కావడంతో...ఓటీటిలో బాగానే అట్రాక్ట్ చేసే అవకాశాలున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios