Asianet News TeluguAsianet News Telugu

గోపీచంద్ `బంగారు బుల్లోడు' కాదు.. చాణక్య!

టైటిల్ సెలక్షన్ అనేది తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ఛాలెంజ్ గా మారిపోయింది.  కొత్త తరహా టైటిల్ అదీ ట్రెండింగ్ లో నిలిచేది పెట్టగలగటం ఓ పెద్ద టాస్క్. అందుకోసం దర్శక,నిర్మాతలు స్టోరీ మీద కన్నా ఎక్కువ కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ధియోటర్ కు రిలీజ్ వచ్చే లోగా ఈ టైటిలే జనాల నోళ్లలో నాని ప్రాజెక్టు మీద క్రేజ్ క్రియేట్ చేసేది..బిజినెస్ కు ప్లస్ అయ్యేది.

Gopichand Spy Thriller Titled as Chanakya
Author
Hyderabad, First Published Jun 9, 2019, 11:55 AM IST

టైటిల్ సెలక్షన్ అనేది తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ఛాలెంజ్ గా మారిపోయింది.  కొత్త తరహా టైటిల్ అదీ ట్రెండింగ్ లో నిలిచేది పెట్టగలగటం ఓ పెద్ద టాస్క్. అందుకోసం దర్శక,నిర్మాతలు స్టోరీ మీద కన్నా ఎక్కువ కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ధియోటర్ కు రిలీజ్ వచ్చే లోగా ఈ టైటిలే జనాల నోళ్లలో నాని ప్రాజెక్టు మీద క్రేజ్ క్రియేట్ చేసేది..బిజినెస్ కు ప్లస్ అయ్యేది. గోపీచంద్ తాజా చిత్రం విషయంలో కూడా అదే పద్దతిలో గత కొంతకాలంగా రకరకాల టైటిల్స్ బయిట ప్రచారంలోకి వచ్చాయి. ఫైనల్ గా ఓ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. 

యాక్షన్ చిత్రాల హీరో గోపీచంద్, తమిళ డైరెక్టర్ తిరు కలయికలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతున్న విషయం విదితమే. మెహరీన్, జ‌రీన్ ఖాన్‌  హీరోయిన్స్ గా  స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో గోపీచంద్ రా ఏజెంట్ గా దర్శనమివ్వనున్నాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో క‌థ కు తగ్గట్లుగా ఈ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని తెలిసింది. 

గ‌త రెండు రోజులుగా ఈ సినిమాకి `బంగారు బుల్లోడు` అనే టైటిల్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే, ఇప్ప‌టికే ఈ టైటిల్‌తో `అల్ల‌రి` న‌రేష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ దానికి సంబంధించిన‌ ఫ‌స్ట్ లుక్ కూడా వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలో… గోపీచంద్ చిత్రానికి `బంగారు బుల్లోడు` అనే టైటిల్ ప్ర‌చారంలోకి రావ‌డం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ను షాక్ ఇచ్చింది.  

గోపీచంద్ 40వ పుట్టిన రోజు (జూన్ 12) సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు.  ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ స్పై థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios