Asianet News TeluguAsianet News Telugu

#Gopichand గోపీచంద్ సినిమాకు అప్పట్లో 12 కోట్లు ..కానీ ఇప్పుడు

 కన్నడ దర్శకుడు ఎ హర్ష తెలుగు డెబ్యు చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తునారు.  

Gopichand pins hopes on Bhimaa do or die film? jsp
Author
First Published Feb 24, 2024, 8:58 AM IST


తెలుగులో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో గోపీచంద్ ఒకడనేది నిజం. విలన్ గా, హీరోగా ఇలా ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చేయగలిగే గోపీచంద్ తన కెరీర్ లో చాలా హిట్స్ ను అందుకున్నాడు. అయితే కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్ రావటంతదో  సరైన విజయం కోసం ఎదురుచూసున్నాడు. తన తర్వాత వచ్చిన యాక్టర్స్ సినిమా సినిమాకి తమ మార్కెట్ పెంచుకుంటూ స్టార్స్ గా ఎదిగిపోతుంటే.. గోపీచంద్ మాత్రం చాలా వెనకపడిపోతున్నాడు.   సినిమా సినిమాకి  పడిపోతున్నాడు. టాలెంట్ ఉన్నప్పటికీ సినిమాల ఎంపిక విషయంలో చేస్తున్న తప్పులే గోపీచంద్ కి ఈ పరిస్థితి రావడానికి కారణమన్న అంటారు. ఇక వరస ఫెయిల్యూర్స్ గోపీచంద్ మార్కెట్ ని సైతం భారీగా దెబ్బ తీసాయి.

ఒకప్పుడు గోపీచంద్ సినిమా అంటే బీ,సి సెంటర్లలలో పండగ. హిందీ మార్కెట్ లో ఫుల్ బిజినెస్ జరిగేది. 10 నుంచి 12 కోట్లు హిందీ మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్దితి తలక్రిందులయ్యాయి. సినిమాని భారీగా యాక్షన్ సినిమా అని బూస్టప్ చేస్తే అప్పుడు 5 నుంచి 6 కోట్లు దాకా హిందీ మార్కెట్ వచ్చే అవకాసం ఉంది. లేకపోతే అదీ లేదు. ప్రమోషన్స్ లో ఏ స్దాయిలో యాక్షన్ సినిమాగా చూపిస్తారనేది ముఖ్యంగా మారింది. అందుకే మనం గమనిస్తే భీమా ప్రమోలు కూడా ప్యూర్ యాక్షన్ గానే కట్ చేసారు. మరో ప్రక్క థియేటర్ మార్కెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఓటిటి వాళ్లు ముందుఎగ్రిమెంట్ చేసుకోవటానికి ఉత్సాహం చూపటం లేదని తెలుస్తోంది. రిలీజ్ అయ్యాక చూద్దామనే రీతిలో ఉన్నారంటున్నారు.

ఇక  గోపీచంద్ (Gopichand) చాలా కాలం తర్వాత మళ్లీ హిట్ కొడతాడేమో అనిపించే చిత్రం భీమా (Bheema).యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రం టీజర్‌ ని ఇప్పటికే విడుదల చేసి ప్రమోషన్స్ ని కిక్ స్టార్ చేశారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష తెలుగు డెబ్యు చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తునారు. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ సైతం అఫీషియల్ గా  ప్రకటించారు. 
 
మార్చి 8 న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ రోజు మహాశివరాత్రి కావటంతో ఆ తేదినే రిలీజ్ కు పెట్టారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. గోపీచంద్ కి జోడీగా ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారు. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ముందుగా ఫిబ్రవరి 16న విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘భీమా‘.. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న రాబోతుంది.  

 ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆధ్యాత్మిక అంశాలతో కూడిన లార్జర్ దెన్ లైఫ్ కథగా ఉంటుంది. గోపీచంద్ పోలీసు అవతార్‌లో మాచోగా కనిపించారు. ఖాకీలో పవర్-ప్యాక్డ్ లుక్‌లో గోపీచంద్ ని చూడటం అభిమానులకు, మాస్‌కి పండుగ. టీజర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హర్ష తన అద్భుతమైన టేకింగ్‌ తో ఆకట్టుకున్నాడు.

 ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష డైరెక్ట్ చేస్తున్న భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  గోపిచంద్ హై వోల్టేజ్ అవతార్‌లో కనిపిస్తున్నాడు.    ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ సినిమాలు గోపి కెరీర్ లొనే బెస్ట్ మూవీస్ గా నిలిచాయి.  భీమా సినిమాకు స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాలో రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ కొరియోగ్రఫీలో ఫైట్స్ ఉండబోతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios