Asianet News TeluguAsianet News Telugu

బలుపు దర్శకుడితో మరోసారి మాస్ రాజా

మాస్ మహారాజా రవితేజ మళ్ళీ కెరీర్ లో సెట్టవ్వలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. రాజా ది గ్రేట్ అనంతరం వరుసగా ప్లాపులను ఎదుర్కొంటున్న ఈ హీరో ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు

gopichand malineni new movie with raviteja
Author
Hyderabad, First Published May 10, 2019, 9:09 AM IST

మాస్ మహారాజా రవితేజ మళ్ళీ కెరీర్ లో సెట్టవ్వలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. రాజా ది గ్రేట్ అనంతరం వరుసగా ప్లాపులను ఎదుర్కొంటున్న ఈ హీరో ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం విఐ. ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు డిస్కో రాజా అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. 

అయితే డిస్కో రాజా అనంతరం మాస్ రాజా ఎలాంటి సినిమా చేస్తారు అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటి లేదు. కథలైతే బాగానే వస్తున్నప్పటికీ మాస్ రాజా మాత్రం వెంటనే ఒప్పుకోవడం లేదట. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల తనకు రెండు సినిమాలతో మంచి హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనికి రవితేజ మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

గతంలో డాన్ శీను - బలుపు సినిమాలు చేసిన గోపీచంద్ అనంతరం సరైన హిట్ అందుకోలేదు. పండగ చేస్కో - విన్నర్ సినిమాలు దర్శకుడికి రేంజ్ ని తగ్గించాయి. 

ఆ తరువాత కొంతమంది హీరోలను కలిసినప్పటికీ గోపీచంద్ కి అవకాశం దక్కలేదు. చివరికి రవితేజతోనే మళ్ళీ ఒక సినిమా చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మాస్ రాజా కూడా గోపి కాన్సెప్ట్ కి ఫిదా అయినట్లు తెలుస్తోంది. మరి  మూడవసారి కలుస్తున్న ఈ కాంబినేషన్ ఏ స్థాయిలో హిట్టందుకుంటుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios