అక్టోబర్ 5 న విడుదలైన ఈ చిత్రం మౌత్ టాక్ బాగానే ఉన్నా యావరేజ్ కలెక్షన్స్ వచ్చాయి.  పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ, సినిమా ప్రేక్షకులను సినిమా హాళ్లలోకి లాగలేకపోయింది. 

 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా మంచి వసూళ్లు నమోదు చేస్తుందని వార్తలు ఓ ప్రక్కన వస్తున్నాయి. మరో ప్రక్కన చిత్ర టీమ్ అనేక ఫేక్ లెక్కలు చెబుతూ జనాలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే వంద కోట్లకు పైగానే ఈ సినిమా వసూళ్లు సాధించిందని ఓ ప్రక్కన టీమ్ ప్రచారం చేస్తోంది. మరో ప్రక్క అంత సీన్ లేదు.. ఇందులో ఎలాంటి నిజాలు లేవు అని అంటున్నారు. అయితే ఇందులో ఏది నిజం...గాఢ్ ఫాదర్ చిత్రం నష్టం తెచ్చింగా, లాబాల్లో ఒడ్డున పడేసిందా చూద్దాం.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు గాఢ్ ఫాదర్ చిత్రం తక్కువ బడ్జెట్ లో రూపొందింది.ఆ బడ్జెట్ కు చిరంజీవి భారీ రెమ్యునేషన్ కలిపినప్పుడే 45 కోట్లుకు చేరింది. అక్టోబర్ 5 న విడుదలైన ఈ చిత్రం మౌత్ టాక్ బాగానే ఉన్నా యావరేజ్ కలెక్షన్స్ వచ్చాయి. పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ, సినిమా ప్రేక్షకులను సినిమా హాళ్లలోకి లాగలేకపోయింది. 55 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా సొంత రిలీజ్ అయినా..చిరు స్దాయికి 80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అంచనా. . ఆ లెక్కన చూస్తే సినిమా ప్లాఫ్ క్రిందే లెక్క. 

కానీ ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ సినిమా నాన్ థియేటర్ బిజినెస్ బాగా చేసింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఆ విషయంలో బాగా ఉపయోగపడ్డారు. పాన్-ఇండియన్ రిలీజ్ ఫ్యాక్టర్, హిందీ వెర్షన్‌లో సల్మాన్ ఖాన్ ఉండటం వల్ల, సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. థియేట్రికల్‌తో పాటు నాన్‌ థియేట్రికల్‌ హక్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటే గాడ్‌ఫాదర్‌ నిర్మాతలు 150 కోట్లు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. ఇవి ఏ సినిమాకైనా భారీ సంఖ్యలు. ఈ లాభాలను చిరంజీవి, ఎన్వీ ప్రసాద్ పంచుకుంటారు. మొత్తంమీద, గాడ్ ఫాదర్ మేకర్స్‌కి లాభదాయకమైన వెంచర్‌ అని చెప్పాలి. 

మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కి రీమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమాలో ముఖ్యమైన గెస్ట్ రోల్ లో సల్మాన్ ఖాన్ నటించిన విషయం తెల్సిందే.ఇక నయనతార ఇంకా సత్యదేవ్ లు కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఒక పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందిన గాడ్ ఫాదర్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.అయితే థియేటర్ కు వచ్చే జనాల సంఖ్య బాగా తగ్గిపోతుంది.చాలా ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు.