బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లేకపోవడంతో దర్శక నిర్మాతలు చాలా నిరాశకు గురయ్యారు. ఈ నేపధ్యంలో సినిమాపై మిగిలిన హైప్‌ని సద్వినియోగం చేసుకోవడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందుకునే కేవలం రెండు వారాల్లోనే OTTలో సినిమాను విడుదల చేస్తున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ ఫిల్మ్ గని కి విమర్శకుల నుండి మరియు ప్రేక్షకుల నుండి దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు క్రియేట్ అయిన హైప్‌ని జస్టిఫై చేయడంలో సినిమా పూర్తిగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లేకపోవడంతో దర్శక నిర్మాతలు చాలా నిరాశకు గురయ్యారు. ఈ నేపధ్యంలో సినిమాపై మిగిలిన హైప్‌ని సద్వినియోగం చేసుకోవడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందుకునే కేవలం రెండు వారాల్లోనే OTTలో సినిమాను విడుదల చేస్తున్నారు.
సాధారణంగా, ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత దాని OTTలో ప్రవేశిస్తుంది. కానీ అది ఘోరంగా డిజాస్టర్ అయినట్లయితే, మేకర్స్ దానిని వీలైనంత త్వరగా OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేస్తారు. రీసెంట్ గా ప్రభాస్ రాధే శ్యామ్‌తో ఇదే జరిగింది. థియేటర్‌లలో విడుదలైన మూడు వారాల తర్వాత OTTలో విడుదలైంది. ఇప్పుడు గని యొక్క స్ట్రీమింగ్ హక్కులు ఆహాకు అమ్మేసారు.. ఇది ఏప్రిల్ 22 నుండి ప్రసారం ప్రారంభమవుతుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గని.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఇందులో వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాని అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి నిర్మించారు. ఈ నెల 8న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
థియేటర్ లో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ కి రెడీ అయిపొయింది. 'ఆహాప్లాట్ ఫామ్ వేదికగా ఈ నెల 22నుంచి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. కాగా ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియా కీలకపాత్రలు పోషించారు.
