Asianet News TeluguAsianet News Telugu

జెనీలియా ముద్దుల కొడుకు బర్త్ డే.. వైరల్ అవుతున్న క్యూట్ పిక్స్!

హీరోయిన్ జెనీలియా దక్షణాది చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నటి. స్టార్ హీరోల సరసన నటించి పలు విజయవంతమైన చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది.అల్లరి పిల్లగా, క్యూట్ హీరోయిన్ గా జెనీలియా పలు చిత్రాల్లో నటించింది.

Genelia D'Souza wishes son Riaan on his birthday
Author
Hyderabad, First Published Nov 25, 2019, 3:25 PM IST

హీరోయిన్ జెనీలియా దక్షణాది చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నటి. స్టార్ హీరోల సరసన నటించి పలు విజయవంతమైన చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది.అల్లరి పిల్లగా, క్యూట్ హీరోయిన్ గా జెనీలియా పలు చిత్రాల్లో నటించింది. జెనీలియా పేరు చెప్పగానే బొమ్మరిల్లు, బాయ్స్, రెడీ, ఆరెంజ్ లాంటి చిత్రాలు గుర్తుకువస్తాయి. 

2012లో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని జెనిలీయ వివాహం చేసుకుంది. ఆ తర్వాత జెనీలియా తెలుగులో నటించలేదు. హిందీ చిత్రాలు కూడా తగ్గించింది. జెనీలియా, రితేష్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రియాన్ 2014లోకి జన్మించగా, చిన్న కొడుకు రహీల్ 2016లో జన్మించాడు. 

సోమవారం రోజు జెనీలియా, రితేష్ దంపతులు తమ పెద్ద కుమారుడు రియాన్ 5వ పుట్టినరోజుని సెలెబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జెనీలియా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. జెనీలియాతన కొడుకు గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Dearest Riaan, Every parent says “I don’t want him to grow up, I want to freeze this age forever”.. But I don’t.. I want to enjoy every year of yours, I want to see you grow into a fine young man, I want to give you wings to fly and I’d like to be the wind beneath those wings. I want to tell you that life is tough but you are tougher, I want you to always believe in yourself no matter what happens cause I will always believe in you.. Apart from everything I want and I wish for you, the one thing I never want to fail to let you know, is that I love you so so so much and you are the greatest thing that happened to me.. There is nothing I’d rather see than your smile and nothing I’d rather hear than your laughter. For all the things my hands have held, the best by far is you. Happy Birthday to the little boy who made me a Mom- My First Born ❤️

A post shared by Genelia Deshmukh (@geneliad) on Nov 24, 2019 at 7:29pm PST

తమ పిల్లలు చిన్నవయసులోనే చూడముచ్చటగా ఉండిపోతే బావుంటుందని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. నాకు కూడా అలానే అనిపిస్తోంది. నీవయసు ఇలాగే ఫ్రీజ్ అయిపోతే బావుంటుంది. కానీ నేను అలా కోరుకోను. నువ్వు ఎదగాలి. ప్రతి సంవత్సరాన్ని ఎంజాయ్ చేయాలి. నీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను. నీ ముఖంలో ఎప్పుడూ నాకు చిరునవ్వు కనిపించాలి. హ్యాపీ బర్త్ డే రియాన్ అని జెనీలియా పోస్ట్ చేసింది. 

తన కొడుకుని జెనీలియా ముద్దుల్లో ముంచెత్తుతున్న క్యూట్ ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. పాలబుగ్గల పసివాడిగా రియాన్ క్యూట్ లుక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios