Asianet News TeluguAsianet News Telugu

'గీత గోవిందం' తొలిరోజు కలెక్షన్లు!

 అక్కడ ప్రీమియర్ షోల ద్వారా మంగళవారం నాటికి రూ.4 లక్షల డాలర్లను రాబట్టింది. బుధవారం నాటికి ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేసేసింది. ఈ వీకెండ్ నాటికి సినిమా మిలియర్ డాలర్ క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు

geetha govindam movie first day collections
Author
Hyderabad, First Published Aug 16, 2018, 12:07 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నూతన చిత్రం 'గీత గోవిందం'. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టినట్లుగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అన్ని ఏరియాల నుండి యునానిమస్ గా ఈ సినిమాకు హిట్ టాక్ రావడం విశేషం. ఓవర్సీస్ లో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించినట్లుగా చెబుతున్నారు.

అక్కడ ప్రీమియర్ షోల ద్వారా మంగళవారం నాటికి రూ.4 లక్షల డాలర్లను రాబట్టింది. బుధవారం నాటికి ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేసేసింది. ఈ వీకెండ్ నాటికి సినిమా మిలియర్ డాలర్ క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు.

విజయ్ దేవరకొండ నటించిన 'పెళ్లి చూపులు','అర్జున్ రెడ్డి' సినిమాలు కూడా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాయి. ఇప్పుడు 'గీత గోవిందం' కూడా ఆ క్లబ్ లో జాయిన్ కానుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర ఏరియాలు కలుపుకొని ఈ సినిమా రూ.6 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios