గంగవ్వ పెద్ద తెరపై మెరవబోతుంది. ఆమె శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న `రాజ రాజ చోర` చిత్రంలో నటిస్తుంది. అంతేకాదు ఇందులో ఏకంగా హీరో శ్రీవిష్ణుతో కలిసి పెగ్గేస్తుంది.
గంగవ్వ పెద్ద తెరపై మెరవబోతుంది. ఆమె శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న `రాజ రాజ చోర` చిత్రంలో నటిస్తుంది. అంతేకాదు ఇందులో ఏకంగా హీరో శ్రీవిష్ణుతో కలిసి పెగ్గేస్తుంది. తాజాగా ఇది హాట్ టాపిక్‌గా, వైరల్‌గా మారింది. `రాజ రాజ చోర` చిత్ర టీజర్ శుక్రవారం విడుదలైంది. ఇది హసిత్ గోలీ దర్శకత్వంలో రూపొందుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలై చక్కర్లు కొడుతుంది. ఇందులో శ్రీవిష్ణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా, దొంగగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన కనిపించనున్నారు. అయితే ఓ క్రమంలో గంగవ్వతో కలిసి ఆయన బాధలు చెప్పుకోవడం, ఆమెతో కలిసి మందేయడం ఆసక్తికరంగా మారింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగుతుందని తాజా టీజర్ స్పష్టం చేస్తుంది. `రాజ రాజ చోర` టైటిల్‌కి తగ్గట్టుగా చివరికి కిరిటాలు పెట్టుకుని, స్కూటిపై వెళ్లడం ఆకట్టుకుంటుంది.
