Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగ్ లీడర్ ప్రీమియర్ షో టాక్

గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చాలా కష్టపడ్డారు. ఫైనల్ గా వీరి కామెడీ థ్రిల్లర్ గ్యాంగ్ లీడర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా ప్రీమియర్స్ ని ప్రవాసులు ముందే వీక్షించారు.సినిమా ప్రీమియర్ షో విషయానికి వస్తే.. 

Gang leader premiere show talk
Author
Hyderabad, First Published Sep 13, 2019, 5:23 AM IST

స్క్రీన్ ప్లే మాస్టర్ విక్రమ్ కె కుమార్ - న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో మొదటిసారి తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ సినిమాపై ఈ ఇద్దరు గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. ఎందుకంటే వారి గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా క్లిక్కవ్వలేదు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చాలా కష్టపడ్డారు. ఫైనల్ గా వీరి కామెడీ థ్రిల్లర్ గ్యాంగ్ లీడర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా ప్రీమియర్స్ ని ప్రవాసులు ముందే వీక్షించారు.

సినిమా ప్రీమియర్ షో విషయానికి వస్తే.. సినిమాలో కామెడీ పంచ్ లు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. సినిమాలో కామెడీ సీన్స్ ని మధ్యలో ఇరికించినట్లు కాకుండా దర్శకుడు విక్రమ్ మంచి కామెడీ ఎపిసోడ్స్ నీ క్రియేట్ చేసుకున్నాడు. సందర్భానుసారంగా వచ్చే డైలాగ్స్ తెరపై చాలా బాగా క్లిక్కయ్యాయి. ఎక్కడా కూడా నిడివి ఎఫెక్ట్ పడకుండా విక్రమ్ తన మ్యాజిక్ స్క్రీన్ ప్లే తో మెప్పించే ప్రయత్నం చేశాడు.ఇక చాలా రోజుల తరువాత ఒక మంచి ట్విస్ట్ కూడా చూసిన  భావన కలుగుతుంది. 

మొత్తంగా నాని నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ రోల్ ఆకట్టుకోవడం గ్యారెంటీ. పెన్సిల్ పార్థసారథిగా సరికొత్త కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ఇక మొదటిసారి నెగిటివ్ షెడ్ లో మెరిసిన యువ హీరో కార్తికేయ అద్భుతంగా నటించి సినిమాకు మరో పిల్లర్ గా నిలిచాడు. హీరోయిన్ అలాగే ఇతర నటినటులు వారి పాత్రలకు తగ్గట్టు కథలో మంచి నటనను కనబరిచారు. మెయిన్ గా చిన్న పాప కీ రోల్ ప్లే చేసి సినిమాకె హైలెట్ గా నిలిచింది. ఇక సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీకి మంచి బూస్ట్ ని ఇచ్చింది.  ఫైనల్ గా సినిమాపై పెద్దగా అంచనాలు పెంచుకోకుండా సింపుల్ గా వెళ్లి చూస్తే మంచి ఫన్ దొరుకుతుంది. మరి కమర్షియల్ గా సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios