నిర్మాతగా ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు తీసినా దిల్ రాజు తన పాత జాబ్ ని మాత్రం అస్సలు వదలడం లేదు. చిన్నా సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా మంచి సినిమాలు వస్తే చాలు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగుతున్నారు. మెయిన్ గా నైజం ఏరియాలో పట్టు బిగించిన దిల్ రాజు మరో సినిమాను కొనుక్కున్నారు. 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా బిజినెస్ డీల్స్ సెట్ చేసుకుంటున్న మైత్రి మూవీ మేకర్స్ కి దిల్ రాజు నుంచి ఒక మంచి అఫర్ దక్కింది. 

8కోట్లకు డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ లెక్కలపై చర్చలు జరిపిన దిల్ రాజు ఫైనల్ రేట్ ను ఫిక్స్ చేసుకొని గ్యాంగ్ లీడర్ నైజం హక్కులని తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. మరి ఈ సినిమా దిల్ రాజుకి ఏ స్థాయిలో లాభాల్ని అందిస్తుందో చూడాలి.