Asianet News TeluguAsianet News Telugu

అన్నాత్తే మోషన్ పోస్టర్... హోరా బ్రిడ్జ్ పై రజినీకాంత్ విశ్వరూపం

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అన్నాత్తే మోషన్ పోస్టర్ లో రజినీ లుక్, మేనరిజం కేక పుట్టించారు. చాలా కాలం తరువాత రజినీ నుండి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా అన్నాత్తే రానుందని లేటెస్ట్ అప్డేట్ తో క్లారిటీ వచ్చింది.

ganesh chaturthi treat rajikanth mesmerises with annaatthe motion poster
Author
Hyderabad, First Published Sep 10, 2021, 7:09 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ పండగ వేళ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఆయన లేటెస్ట్ మూవీ అన్నాత్తే మోషన్ పోస్టర్ విడుదల చేశారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అన్నాత్తే మోషన్ పోస్టర్ లో రజినీ లుక్, మేనరిజం కేక పుట్టించారు. చాలా కాలం తరువాత రజినీ నుండి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా అన్నాత్తే రానుందని లేటెస్ట్ అప్డేట్ తో క్లారిటీ వచ్చింది. 


రాయల్ ఎన్ఫీల్డ్ పై వచ్చిన రజినీ హౌరా బ్రిడ్జిపై బీభత్సం సృష్టించాడు. వేటకొడవలితో తనదైన శైలిలో వేటాడాడు. వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ తో ఉన్న బైక్,హౌరా బ్రిడ్జ్... ఇవన్నీ గమనిస్తుంటే, అన్నాత్తే మూవీలో దర్శకుడు అదిరిపోయే కలకత్తా ఎపిసోడ్స్ రూపొందించారని అర్థం అవుతుంది. ఇక ఈ మూవీలో రజినీ పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు. 


భారీ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో నయనతార, కీర్తి సురేష్ లతో పాటు  కుష్బూ,మీనా, ప్రకాష్ రాజ్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. మాస్ చిత్రాల దర్శకుడిగా ఉన్న శివ అన్నాత్తే మూవీని తెరకెక్కించారు. సన్ పిక్టర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందించారు. అన్నాత్తే మూవీ దీపావళి కానుకగా థియేటర్స్ లో దిగనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios