అఫీషియల్‌ః `గేమ్‌ ఛేంజర్‌` పాట వాయిదా ప్రకటన.. కారణం వేరే ఉందిగా!

రామ్‌చరణ్‌ నటిస్తున్న` గేమ్‌ ఛేంజర్‌` సినిమా నుంచి తొలి పాట `జరగండి`ని దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా దాన్ని వాయిదా వేస్తూ టీమ్‌ అఫీషియల్‌ నోట్ ని పంచుకుంది.

game changer movie jaragandi song postponed official note reason different arj

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` నుంచి పాట వస్తుందని, గత వారం రోజులుగా ఉదరగొట్టారు. దీపావళి అకేషన్‌ కూడా ఫిక్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో వెయిట్‌ చేస్తున్నారు. అంతలోనే పాట్‌ విజువల్స్ లీక్‌ కావడం పెద్ద ఎఫెక్ట్ అయ్యింది. దీనికితోడు పాట వాయిదా అంటూ గత రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. నిర్మాణ సంస్థ ఓ నోట్‌ని సోషల్‌ మీడియాలో పంచుకుంది. 

రూమర్లని నిజం చేస్తూ `జరగండి` అంటూ సాగే పాట విడుదల వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అందుకు కారణం చెబుతూ, ఆడియో డాక్యుమెంటేషన్‌లో నెలకొన్న సమస్యల కారణంగా పాటని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఆడియో డాక్యుమెంటేషన్‌లో విభిన్న రకాల సమస్యలు వచ్చాయని, దీంతో `గేమ్‌ ఛేంజర్‌` నుంచి `జరగండి` పాటని వాయిదా వేస్తున్నామని తెలిపారు. 

మళ్లీ ఎప్పుడు రిలీజ్‌ చేస్తామనేది త్వరలోనే వెల్లడిస్తామని, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శకుడు శంకర్‌ ఫ్యాన్స్ వెయిటింగ్‌కి తగ్గ వర్త్ తో పాట ఉంటుందని, `గేమ్‌ ఛేంజర్‌`కి సంబంధించి ప్రతిదీ ది బెస్ట్ ఉంటుంది, క్వాలిటీతో కూడిన వినోదాన్ని అందించేందుకు టీమ్‌ అవిశ్రాంతంగా వర్క్ చేస్తుందని చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

అయితే `జరగండి` పాట వాయిదా వేయడానికి ఇప్పట్నుంచి ప్రమోషన్స్ వద్దనుకుని వాయిదా వేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. అలాగే సింగర్‌ని మారుస్తున్నారని, మొదట అనుకున్న సింగర్ పాడిన సాంగ్ అంతగా రాలేదని, దీంతో సింగర్‌ని మారుస్తున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ దానికి భిన్నంగా టీమ్‌ కారణం చెప్పడం గమనార్హం. ఏదేమైనా దీపావళి పండగ రోజు పాటతో పండగ చేసుకోవాలనుకున్న చరణ్‌ఫ్యాన్స్ కిది డిజప్పాయింట్‌ వార్తే అని చెప్పొచ్చు. 

ఇక రామ్‌చరణ్‌ హీరోగా, శంకర్‌ రూపొందిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios