Asianet News TeluguAsianet News Telugu

‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ సాంగ్ అప్డేట్.. మెగా156 స్పెషల్ పోస్టర్.. ‘హరోం హర’ ఫస్ట్ లుక్

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి అభిమానులు ఎదురుచూస్తున్న సాలిడ్ అప్డేట్ అందింది. మెగా156 నుంచి ఇంట్రెస్టింగ్  పోస్టర్, అలాగే సుధీర్ బాబు అప్ కమింగ్ ఫిల్మ్ నుంచి ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంటోంది.
 

Game Changer First Song Update andl Mega 156 poster NSK
Author
First Published Oct 23, 2023, 11:38 PM IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan) సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). దసరా సందర్భంగా నయా పోస్టర్, తొలిసాంగ్ పైనా అప్డేట్ అందించారు.  ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ద‌స‌రా సంద‌ర్భంగా మేక‌ర్స్ ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమాకు సంబంధించి స‌రికొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. దీంతో పాటు మ‌రో అమేజింగ్ అప్‌డేట్‌ను అందించారు. దీపావ‌ళి సంద‌ర్బంగా ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌తో పాటు మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ క‌లిసి తొలిసారి వ‌ర్క్ చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా నుంచి పాట‌ను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. 

Game Changer First Song Update andl Mega 156 poster NSK

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మెగా156 రూపుదిద్దుకోనుంది. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ఠ దర్వకత్వంలో చిరు నటించబోతున్నారని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం ఎవరి ఊహకు అందదని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూపించబోతున్నామన్నారు. ఇక దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రానికి సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. గత పోస్టర్ లో పంచభూతాలు, నక్షత్రాన్ని చూపించగా.. ఈసారి త్రిశూలాన్ని చూపించారు. మొత్తానికి పోస్టర్లు మాత్రం ఆసక్తిని పెంచుతున్నాయి. 

Game Changer First Song Update andl Mega 156 poster NSK

ఇక నైట్రో స్టార్ సుధీర్ బాబు నెక్ట్స్ ఫిల్మ్ ‘హరోం హర’ (Harom Hara). యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది. జ్నానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మన్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్  సంగీతం అందిస్తున్నారు. విజయదశమి సందర్భంగా చిత్రం నుంచి సుధీర్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సుబ్రహ్మణం స్వామిగా  మాలధారణలో సుధీర్ బాబు కనిపించారు.  బండపై కూర్చొని తీక్షణమైన ఆలోచనలో ఉండగా.. వెనకాల ఊరిజనాలున్న దృశ్యం చూడవచ్చు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సుధీర్ బాబు మరో విభిన్నమైన కథతో, పాత్రతో అలరించబోతున్నారని అర్థమవుతోంది.  

Game Changer First Song Update andl Mega 156 poster NSK

Follow Us:
Download App:
  • android
  • ios