Asianet News TeluguAsianet News Telugu

#Gaalodu:'గాలోడు' కలెక్షన్స్...ట్రేడ్ కు షాక్, ఇదేం మాస్

పెద్ద హీరోల సినిమాలు సైతం  బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడుతున్న ఈరోజుల్లో..ఒక బుల్లితెర స్టార్ సినిమాకి జనాలు నీరాజనం పట్టడం ట్రేడ్ ని షాక్ కు గురిచేస్తోంది.
 

Gaalodu Occupancy is more than all other films in C centers and few B centers
Author
First Published Nov 27, 2022, 8:40 AM IST


పది రోజుల క్రితం రిలీజైన  సుడిగాలి సుధీర్ ‘గాలోడు’భాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాడు. ఏదో గాలివాటు చిత్రం అనుకుంటే ఈ సినిమా  భాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. బి,సి సెంటర్లలో ఈ సినిమాకు ఎదురే లేకుండా పోయింది. ఈ సినిమాతో పాటు రిలీజైన మసూద చిత్రం కలెక్షన్స్ జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. అంతకుముందు వారం వచ్చిన యశోద ది అదే పరిస్దితి. ఈ సినిమా మాత్రం ఈ వీకెండ్ లో కూడా కలెక్షన్స్ పరంగా ఊచకోత కోస్తోంది.

మొదటి వారం డివైడ్  టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో వారంలో కొత్త సినిమాల నుండి పోటిని ఎదుర్కొని నిలబడటమే కాకుండా ఓ రేంజిలో పోటీ ఇస్తోంది.   ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే మంచి హోల్డ్ ని చూపిస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం…ట్రేడ్ ని ఆశ్చర్య పరుస్తోంది.

 ఏడవ రోజు 41 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న ఈ చిత్రం 8వ రోజుకి వచ్చే సరికి ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే 30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో ఇప్పుడు టోటల్ గా 8 రోజులు కలెక్షన్స్ చూస్తే..
 
 నైజాం – 2.52 కోట్లు
 సీడెడ్ – 83 లక్షలు
 ఆంధ్రా – 3.33 కోట్లు
మొత్తం ఆంధ్రా, తెలంగాణా :-  3.60 షేర్
 ప్రపంచ వ్యాప్తంగా –  3.67 షేర్ సంపాదించింది.

అసలు ఈ సినిమాకి ఇంత స్టడీ కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి అనేది ట్రేడ్ పండితులకు సైతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. మాస్ కు ఉన్న హోల్డ్ ఇదీ అంటున్నారు మరికొందరు. సినిమా చూసిన ఓ వర్గం గొప్పగా ఏమీ లేదు..జస్ట్ ఓకే అన్నా..... నెగటివ్ టాక్ వచ్చినా  మొదటి వారం కూడా పూర్తి కాకముందే బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా గొప్ప విషయం.

Follow Us:
Download App:
  • android
  • ios