నందమూరి బాలకృష తన 106వ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష-బోయపాటిలది సక్సస్ ఫుల్  కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ మొదలెట్టిన బోయపాటి..లాక్ డౌన్ తో షూటింగ్ ఆపు చేసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే సినిమాకు సంభందించిన వార్తలు మాత్రం మీడియాలో ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం టైటిల్ గురించి మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. అయితే అది ప్లాఫ్ టైటిల్ కావటంతో అభిమానులకు నచ్చటం లేదు. 

వివరాల్లోకి వెళితే...ప్ర‌స్తుతం ఈ సినిమాకి వ‌ర్కింగ్ టైటిల్‌గా బిబి3 అని వ్యవహిస్తున్నారు. అయితే ఈ సినిమాకి రెండు, మూడు టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. మోనార్క్‌, డేంజ‌ర్ అనే టైటిల్స్ ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. బాల‌య్య‌, బోయ‌పాటి డేంజ‌ర్ అనే టైటిల్‌పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు చెప్తున్నారు. గ‌తంలో కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో డేంజ‌ర్ అనే టైటిల్‌తో సినిమా వ‌చ్చింది. ఈ సినిమా రిలీజ్ అయి 10 సంవ‌త్స‌రాలు దాటిపోయింది.

కాబ‌ట్టి ఈ టైటిల్‌ను బాల‌కృష్ణ సినిమాకి పెట్టడంలో ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు. ఇదే టైటిల్ ఫైన‌ల్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. అయితే ఈ టైటిల్ పై అభిప్రాయం తెలుసుకోవటానికే ప్రచారంలోకి తెచ్చారని కొందరు అంటున్నారు.
 
ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది.  అందులో ఓ పాత్రే అఘోరా అని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య కవలలుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారని, చిన్నతనంలోనే వారిద్దరు వేరు అయి ఒకరు వారణాసిలో, మరొకరు అనంతరపురంలో పెరుగుతారని ఇటీవల ప్రచారం జరిగింది.  
 
బోయపాటి మాట్లాడుతూ.. అఘోరా టైపు క్యారెక్టర్ ఒకటి ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఎలా డిజైన్ చేశాం, ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. "సింహా", "లెజెండ్" నుంచి కొంచెం బయటకొచ్చి కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు నాకు ఆ పాత్ర తట్టింది. కాకపోతే సెటప్ అంతా కొత్తగా ఉంటుంది. కొత్తదనం కావాలంటే ఈమాత్రం ట్రై చేయాల్సిందే అని చెప్పారు.