Asianet News TeluguAsianet News Telugu

యువతిపై కమెడియన్ అత్యాచారం.. ఉద్యోగం పేరుతో వల.. కేసు నమోదు

స్టాండప్ కమెడియన్ ఖ్యాలీ సహారాన్ (Khayali Saharan)పై తాజా కేసు నమోదైంది. ఓ యువతిపై అత్యాచారం చేసినందుకు గాను పోలీసులు కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది.
 

FiR file against Comedian Khayali Saharan
Author
First Published Mar 17, 2023, 1:29 PM IST

స్టాండప్ కమెడియన్ ఖ్యాలీ సహారాన్ టీవీ షోలతో హిందీ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన కామెడీ కంటెంట్ తో బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఖయాలీపై పోలీసు కేసు నమోదైంది. ఈమేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ సమాచారం మేరకు..  హాస్యనటుడైన ఖ్యాలీ సహారన్ 25 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జైపూర్ పోలీసులు అతనిపై అత్యాచారం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌లోని ఓ హోటల్ గదిలో 25 ఏళ్ల యువతిపై హాస్యనటుడు ఖయాలీ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు గురువారం (మార్చి 16) తెలిపారు. అయితే మార్చి14నే  ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సహారాన్‌పై మానసరోవర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఉద్యోగం ఇప్పిస్తానంటూ అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణపై ఖ్యాలీపై కేసు నమోదైందన్నారు. ఉద్యోగమనే నెపంతో మానసరోవర్ ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో ‘తాగిన మత్తులో’ మహిళపై ఖయాలీ అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు నిందితుడు ఖ్యాలీపై ఐపీసీ సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం పోలీసులు ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నారని మానసరోవర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ యాదవ్ తెలిపారు. 

బాధిత యువతి శ్రీగంగానగర్‌లో నివాసముంటున్నదని,  ఓ కంపెనీలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు నెల రోజుల క్రితం, ఆమె మరొక మహిళతో పని కోసం సహాయం కోరుతూ ఖ్యాలీని  సంప్రదించిందని అన్నారు. ఈ క్రమంలో ఖ్యాలీ ఓ హోటల్‌లో రెండు గదులు బుక్ చేశాడు. ఒకటి తన కోసం, మరొకటి స్త్రీలిద్దరికీ కోసమని. ఆ తర్వాత ఖ్యాలీ బీరు తాగి, వారికీ బలవంతంగా బీరు తాగించాడని యువతి ఫిర్యాదులో పేర్కొందన్నారు. అనంతరం ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడరని తెలుస్తోంది. 

ఖ్యాలీ గ్రేట్ ఇండియన్ ఛాలెంజ్ సీజన్ 2 కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.  ఈ సీజన్ విజేతగా రౌఫ్ లాల్ నిలిచారు. అలాగే 'ది కపిల్ శర్మ షో' షోలోనూ ఖ్యాలి కనిపించాడు. మరోవైపు ఖ్యాలీ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూనే ఉంటారు. ఈయనకు ఇన్ స్టాలో 70.4K ఫాలోవర్స్  కూడా ఉండటం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios