బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ వారి పేరెంట్స్, సిస్టర్స్ మరియు ఫ్రెండ్స్ కలవడం జరిగింది. చివరిగా మిగిలిన లాస్యను కలవడానికి భర్త మరియు కొడుకు వచ్చారు, కొడుకు జున్నుని చూసిన లాస్య ఎమోషనల్ అయ్యారు. లాస్య భర్త చాలా బాగా ఆడుతున్నావ్ అన్నాడు. గెలుపోటములు కాదు, అందరూ నా గురించి మంచిగానే చెప్పుకుంటున్నారా అని, లాస్య అడిగారు. లాస్య కొడుకు చాల క్యూట్ గా ఉన్నాడని, ఇంటి సభ్యులు మెచ్చుకున్నారు. 

కెప్టెన్సీ టాస్క్ కి ఎంపికైన అఖిల్, అభిజిత్ మరియు హరికలకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యుల భుజాలపై ఎక్కి కూర్చోవాలని, ఎవరు ఎక్కువ సేపు ఒకరి భుజాలపై ఉంటే వారు కెప్టెన్ అవుతారని చెప్పారు. అభిజిత్, అవినాష్ భుజాలపై, సోహైల్ భుజాలపై అఖిల్ కూర్చున్నారు. ఇక హరికను మోనాల్ తన భుజాలపైకి ఎత్తుకుంది. 

అభిజిత్ బరువును మోయలేక అవినాష్ తనని క్రింది దించేశాడు. ఇక అఖిల్ బరువు చాలా సేపటి వరకు భరించిన సోహైల్ కూడా మోయలేక దించేశాడు. హరికను ఎత్తుకున్న మోనాల్ చివరి వరకు నిలబడడంతో హారిక టాస్క్ గెలిచి కెప్టెన్ అయ్యారు. కెప్టెన్ అయిన హారిక తన ఫేవరేట్ కంటెస్టెంట్ నోయల్ కోరిక తీర్చినట్లు చెప్పుకొని ఆనందపడ్డారు. 

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను హయర్ ఫోర్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇంటి సభ్యుల ముందు పెట్టి వారికి కావాల్సిన లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్‌ను దానిలోపల ఉంచారు. వాటిని పొందడానికి ఇంటి సభ్యుల ముందు ఎప్పటిలానే ఒక టాస్క్ ఉంచారు. వారిలో నలుగురుని ఎంపిక చేసి వారిని క్విజ్ మాస్టర్ అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కండిషన్ పెట్టారు. సరైన సమాధానం చెప్పిన ఇంటి సభ్యుడు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసి ఒక లగ్జరీ బడ్జెట్ ఐటమ్ తీసుకోవచ్చు.

ఈ టాస్క్‌లో క్విజ్ మాస్టర్‌గా అవినాష్‌ను.. క్విజ్‌లో పాల్గొనాల్సిన సభ్యులుగా సోహెల్, లాస్య, అభిజీత్, మోనాల్‌లను ఎంపిక చేశారు. ఒక్కొక్క సభ్యుడిని క్విజ్ మాస్టర్ అవినాష్ ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. అన్నీ బిగ్ బాస్ హౌజ్‌కు సంబంధించినవే అడిగారు. సమాధానాలు చెప్పిన ఇంటి సభ్యులు. చికెన్, ప్రాన్స్, బ్రెడ్, జామ్, వంటి అనేక ఐటమ్స్ పొందారు.