ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సర్ అజయ్ చాందని బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందారు. 48 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయనకు భార్యా,కుమార్తె ఉన్నారు. 

ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సర్ అజయ్ చాందని బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందారు. 48 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయనకు భార్యా,కుమార్తె ఉన్నారు. నిన్న సోమవారం సాయింత్రం ఏడున్నర లక్షలు చేసే తన కొత్త బైక్ సుజికి వో స్ట్రోమ్ 650 XT పై బయిలు దేరారు. ఇంటినుంచి బయిలుదేరి బయిటకు వెళ్లిన ఆయన బైక్ ని స్పీడుగా నడిపారు. కాసేపటికి ఆయన కంట్రోలు తప్పి ఓ కాంపౌండ్ వాల్ కు గుద్దుకుంది. దాంతో స్పాట్ లోనే ఆయన మరణించారు. ఇదంతా బెంగుళూరు వసంత్ నగర్ లోజరిగింది. 

స్పీడుగా వచ్చి మలుపు తిప్పుతూండగా, స్ట్రీట్ లైట్స్ లేకపోవటంతో చాలా చీకటిగా ఉండటంతో మలుపు దగ్గర వాల్ ని గుద్దేసి ఉంటారని పోలీస్ లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపట్లోనే దగ్గరలో ఉన్న జైన్ హాస్పటిల్ కు తీసుకు వెళ్లినా ఫలితం లేదు. పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయటంతో కన్నడ ఇండస్ట్రీలో అజయ్ కు మంచి పేరుంది. అజయ్ తండ్రి కన్నడ పరిశ్రమలో హిందీ సినిమాలకు పేరున్న డిస్ట్రిబ్యూటర్. 

దాంతో సుదీప్ తో సహా మరికొందరు హీరోలు తమ సంతాపం సోషల్ మీడియాలో తెలియచేసారు. తెలుగులో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నారు. ఈ వార్త విన్న కొందరు తెలుగు నిర్మాతలు తమ ఆవేదన వ్యక్తం చేసారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred