షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి గాయమై ఉంటుందని ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందారు. అదే సమయంలో దానిపై ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుండి స్పష్టత కోరుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయం మేరకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ స్పందించడం జరిగింది. 


ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ షురూ చేసిన రాజమౌళి తన దైన శైలిలో సినిమాపై మరింత హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆర్ ఆర్ ఆర్ ఎన్టీఆర్, చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలు, మేకింగ్ వీడియో లతో పాటు, దోస్తీ సాంగ్ ఆకట్టుకున్నాయి . తాజాగా చరణ్, ఎన్టీఆర్ గోడపై కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, ఓ కెమెరాతో రాజమౌళి షూట్ చేస్తున్నారు. ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 


అయితే సదరు వీడియోలో ఎన్టీఆర్ ముఖంపై చిన్న గాటు కనిపించింది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి గాయమై ఉంటుందని ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందారు. అదే సమయంలో దానిపై ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుండి స్పష్టత కోరుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయం మేరకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ స్పందించడం జరిగింది. ఎన్టీఆర్ ముఖంపై ఉన్న ఆ గాయం కేవలం మేకప్ మాత్రమే అని, అది నిజమైన గాయం కాదని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీనితో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 


ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రారంభంలోనే చరణ్, ఎన్టీఆర్ గాయాలపాలయ్యారు. ఎన్టీఆర్ మణికట్టుకు గాయం కావడంతో కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నారు. ఇక గతంలో కూడా ఎన్టీఆర్ కి షూటింగ్ సమయంలో అనేక మార్లు గాయాలపాలు కావడం విశేషం. ఆది సినిమా షూటింగ్ సమయంలో ఓ యాక్షన్ సన్నివేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ ముఖంపై గాయం కావడం జరిగింది. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13న వ్ విడుదల కానుంది. 

Scroll to load tweet…