టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమానినో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పొచ్చు. గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ ని నిర్మాతగా నిలబెట్టింది పవనే.
కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్నా భీమ్లా నాయక్ ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న రిలీజ్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగింది. పవన్ కటౌట్ లు, ఫ్లెక్సీలతో పోలీస్ గ్రౌండ్స్ కళకళలాడుతోంది. ఆ గ్రౌండు అంతా సీఎం..సీఎం అనే అరుపులతో దద్దరిల్లిపోయింది. రిలీజ్ ట్రైలర్ వచ్చాక అభిమానులు పండగ వాతావరణంతో రచ్చ షురూ చేశారు.అయితే ఈ పంక్షన్ లో ఫ్యాన్స్ కు ఒకటే లోటు కనిపించింది. అదే బండ్ల గణేష్ స్పీచ్ లేకపోవటం.
ఇక టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమానినో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పొచ్చు. గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ ని నిర్మాతగా నిలబెట్టింది పవనే. ఇక అప్పటి నుంచి పవన్ గురించి ప్రతి ఫంక్షన్ లో బండ్ల మాట్లాడే మాటలు అటు చిత్ర పరిశ్రమను, ఇటు ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేసాయి అనడంలో అతిశయోక్తి లేదు. గబ్బర్ సింగ్, తీన్ మార్, వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో బండ్లన్న స్పీచ్.. గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది.
ఆ స్పీచ్ విన్న ప్రతి పవన్ అభిమాని ఫిదా కాకుండా ఉన్నాడు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. పవన్ కి సంబంధించిన ప్రతి ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ లేకుండా ఉండదు. అయితే ఈసారి బండ్లన్న మెరుపులు ఉంటాయా..? అనే కొంతమంది ఉంటాయని.. మరికొందరు ఉండవని అనుకున్నారు. ఊహించని విధంగా ఈ ఈవెంట్ కు ముందు బండ్ల ఆడియో విడుదలై షాక్ ఇచ్చింది. ఇక అదే ఈవెంట్లో బండ్ల గణేష్ రావాలంటూ కొందరు అభిమానులు హంగామా క్రియేట్ చేసారు. ఆ వీడియోని బండ్ల గణేష్ స్వయంగా ట్వీట్ చేసారు.
‘
పవన్ భక్తుడిగా ఆయన మాటల్లో మా భావాలను పంచుకుంటున్నాం.. అలాంటిది ఆయన స్పీచ్ లేకపోతే మా దైవం పవన్ కళ్యాణ్ గురించి మా తరుపున మాట్లాడేవారు ఎవ్వరు ఉండరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భీమ్లానాయక్’(Bheemla Nayak). ఈ సినిమా 25న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా బెనిఫిట్ షో, అదనపు షోలు వేయరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, టికెట్ రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సినిమాటోగ్రఫీ చట్టం 1952 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో వెల్లడించారు. ఈమేరకు అన్ని జిల్లాల్లో తహసీల్దార్లు వారి పరిధిలోని థియేటర్లకు నోటీసులు జారీ చేశారు.
