ఎన్టీఆర్ కు ఊహించని సర్ ప్రైజ్.. ఎయిర్ ప్లేన్ బ్యానర్ తో అభిమానం చాటుకున్న యూఎస్ఏ ఫ్యాన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఈక్రమంలో అభిమానులు తారక్ కు ఊహించని విధంగా థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
‘ఆర్ఆర్ఆర్’తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు విదేశాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఏర్పడింది. అప్పటికే తారక్ కు జపాన్ దేశంలో ఏ రేంజ్లో అభిమానులు ఉంటారో తెలిసిందే. ఇక రీసెంట్ గా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం అమెరికాకు వెళ్లిన తారక్ ను ఫ్యాన్స్ ను ఏవిధంగా రిసీవ్ చేసుకున్నారో చూశాం. ఇదిలా ఉంటే.. ఆస్కార్ అవార్డు దక్కించుకునేందుకు ఎన్టీఆర్ తనవంతుగా శ్రమించడం, RRRలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ కు యూఎస్ఏ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆస్కార్ వేడుకకోసం అమెరికాకు వచ్చి ఫ్యాన్స్ తో మీట్ అయిన ఎన్టీఆర్ కు తాజాగా అభిమానులు ఊహించని విధంగా సర్ ప్రైజ్ ఇచ్చారు.
ప్రపంచ సినిమా స్టూడియోలకు ప్రసిద్ది అయిన హాలీవుడ్ పై ఎయిర్ ప్లేన్ బ్యానర్ ఎగురవేసి ఎన్టీఆర్ కు థ్యాంక్స్ చెప్పారు. అభిమానులుగా తమను ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రంతో ఖుషీ చేసినందదుకు వినూత్నంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హాలీవుడ్ పై రెపరెపలాడిన ఎయిర్ ప్లేన్ బ్యానర్ కు సంబంధించిన వీడియోను నెట్టింట విడుదల చేశారు. ‘హాలీవుడ్, ప్రపంచ సినిమా గుండెపై ఎయిర్ ప్లేన్ బ్యానర్. త్రిపుల్ ఆర్ మూవీతో గుర్తుండిపోయే రైడ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. NTR30 కోసం ఎదురుచూస్తున్నాం. ఎన్టీఆర్, కొరటాల శివ తోపాటు టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం.
ఏప్రిల్ 5, 2024న నగరం మొత్తం సందడి చేద్దాం’ అంటూ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ పై అభిమానంతో ఇలా ఎయిర్ ప్లేన్ బ్యానర్ ను ఆకాశంలో ప్రదర్శించడం ప్రస్తుతం నెట్టింట ఆసక్తికరంగా మారింది. ఇక్కడి ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. తారక్ అభిమానులుగా గర్విస్తున్నారు. ఇక మార్చి 23న NTR30కి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. గ్రాండ్ గా పూజా కార్యక్రమాల తర్వాత చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తారక్ సరసన నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ స్కేల్లో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NRT31 కూడా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే.