యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టారు. ఆయన బర్త్ డే సీడీపీ లాంఛ్  చేయడంతో పాటు భారీగా ట్రెండ్ చేయనున్నారు. ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23కాగా చాలా ముందుగానే బర్త్ డే సీడీపీ లాంఛ్ చేశారు. ఇక ప్రభాస్ బర్త్ డే సీడీపీ అద్భుతంగా ఉంది. బాహుబలి గెటప్ లో ఉన్న ప్రభాస్ ఆకట్టుకుంటుండగా, ఫోటో చుట్టూ ఉన్న గోల్డ్ కలర్ ఫ్రేమ్ లో ప్రభాస్ సినిమా పేర్లు రాసి ఉన్నాయి. 

ఇక ప్రభాస్ బర్త్ డే సీడీపీ ని భారీగా ట్రెండ్ చేయనున్నారని సమాచారం. బర్త్ డే సీడీపీ, మరియు బర్త్ డే ట్యాగ్ మిలియన్స్ లో ట్రెండ్ చేసి మహేష్, పవన్ సెట్ చేసిన రికార్డ్స్ బ్రేక్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. మరి దేశవ్యాప్తంగా ప్రభాస్ కి అభిమానులు ఉండగా ఇది పెద్ద ఛాలెంజ్ కాకపోవచ్చు కాగా నిన్న తన ఫిట్నెస్ ట్రైనర్ కి రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ గా ఇచ్చి ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. 

కాగా త్వరలో ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ లో పాల్గొననున్నారు. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ నుండి మొదలుకానుందని ఆయన తెలియజేశారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న రాధే శ్యామ్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. దీనితో పాటు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ప్రభాస్ 21, మరియు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రాలలో కూడా ప్రభాస్ నటించాల్సి ఉంది.