ఎన్టీఆర్ ఆరోగ్యం బాగాలేదు, అయినా కూడా అన్న కోసం.. తారక్, కళ్యాణ్ రామ్ అనుబంధానికి ఇదే నిదర్శనం
బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజేంద్ర రెడ్డి దర్శకుడు కాగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే తొలిసారి ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నారు.
ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి కళ్యాణ్ రామ్ సోదరుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అభిమానుల కేరింతల మధ్య తన ప్రసంగాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు. బాడీ పైన్స్ ఉన్నాయి. కాబట్టి గోల చేయవద్దు అంటూ తారక్ అభిమానులకు రిక్వస్ట్ చేశాడు.
బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడానా ఎన్టీఆర్ అతిథిగా హాజరయ్యారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. మరోసారి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కోసం హెల్త్ సరిగ్గా లేకున్నా హాజరు కావడం నందమూరి అభిమానుల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మధ్య బంధానికి ఇదే నిదర్శనం అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఎప్పుడూ నా వెనుక ఉండి నడిపించే నా తమ్ముడు అంటూ ఎన్టీఆర్ ని ఉద్దేశించి ప్రసంగించారు. అన్న దమ్ముల అనుబంధం అంటే ఇదే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమిగోస్ చిత్రం ఘనవిజయం సాధిస్తుంది అనే విశ్వాసాన్ని ఎన్టీఆర్ వ్యక్తం చేశారు.