Asianet News TeluguAsianet News Telugu

చిరు, బాలయ్య మధ్య ఫ్యాన్ వార్... ఎవరి లుక్ బెస్ట్ అంటూ

నందమూరి మెగా అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ చాలా సాధారణం. నిన్న గాడ్ ఫాదర్ నుండి చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేయగా సోషల్ మీడియాలో ఇరు వర్గాల ఫ్యాన్స్ వాదనకు దిగారు.

fan war between balakrishna and chiranjeevi fans
Author
Hyderabad, First Published Jul 5, 2022, 2:45 PM IST

దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా ఇది తెరక్కుతుంది. నిన్న గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒరిజినల్ వెర్షన్  మోహన్ లాల్ (Mohan Lal)లుక్ ఫాలో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. మోహన్ లాల్ తెల్ల చొక్కా పంచె ధరించగా, చిరంజీవి మాత్రం బ్లాక్ లాల్చీ, ప్యాంటులో కనిపించారు. ఇక బాలయ్య 107వ చిత్రం సెట్స్ పై ఉండగా.. ఆ మూవీలో బాలకృష్ణ బ్లాక్ షర్ట్, పంచలో కనిపించారు. 

ఈ రెండు చిత్రాల్లో చిరంజీవి, బాలకృష్ణ(Balakrishna) సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ట్రై చేశారు. దాదాపు దగ్గర పోలికలు ఉన్నాయి. దీంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది. మా హీరో లుక్ బాగుందంటే మా హీరోనే అద్భుతం అంటూ గొడవకు దిగారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్, మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. నిన్నటి నుండి చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఫ్యాన్ వార్ తారాస్థాయిలో జరుగుతుంది. 

మరోవైపు ఈ రెండు చిత్రాలు దసరా బరిలో నిలిచే ఆస్కారం కలదంటున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి కాగా త్వరలో గాడ్ ఫాదర్, బాలయ్య 107 చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ మొదలుకానుంది. నిజంగా ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ పోరుకు దిగితే రసవత్తరంగా ఉంటుంది. ఇక బాలయ్య, చిరంజీవి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడి చాలా కాలం అవుతుంది. కాగా అఖండ విజయంతో బాలయ్య ఊపుమీదున్నారు. చిరంజీవి మాత్రం ఆచార్య ఫెయిల్యూర్ తో డీలా పడ్డారు. ఆయన గాడ్ ఫాదర్ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. బాలయ్య చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios