Asianet News TeluguAsianet News Telugu

అభిమాని సర్ ప్రైజ్.. ఫిదా అయిన సోనూసూద్

రీల్ విలన్..రియల్ హీరో సోనూసూద్ కు తన అభిమాని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఒక రకంగా ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ సర్ ప్రైజ్ కు ఫిదా అయ్యాడు స్టార్ హీరో..
 

Fan Special Surprise to Real Hero Sonu Sood JMS
Author
First Published Feb 24, 2024, 10:04 AM IST

కరోనా టైమ్ లో స్టార్ట్ చేసి.. ఇప్పటికీ సమాజ సేవ చేస్తూనే ఉన్నాడు బాలీవుడ్, టాలీవుడ్ రీల్ విలన్.. రియల్ హీరో సోనూసూద్. ఎందరో జీవితాల్లో ఆయన వెలుగు నింపారు. చదువుకోవాలి అనుకున్న వారిని ఎంత వరకైనా చదివిస్తా అన్నారు. సత్తా ఉండి సపాదన లేని వారికి.. ఉపాధి కల్పించారు.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. సోనూసూద్ చేసిన సాయానికి  గుళ్ళు కట్టేశారు దేశంలో. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు గుడి ఉంది అంటే..సోనూసూద్ ఎంత మంచి వాడు కాకపోతేగుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. 

తాజాగా సోనూసూద్ పై ఆయన అభిమానుల ప్రేమ మరోసారి రుజువు అయ్యింది.  ఓ అజ్ఞాత అభిమాని సోనూసూద్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. రీసెంట్ గా  సోనూసూద్‌ తన ఫ్యామిలీతో కలిసి  ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు.  కుటుంబంతో కలిసి భోజనం చేసిన తరువాత బిల్లు కడదామని  సిబ్బందిని పిలిచాడు స్టార్ నటుడు. కాని అప్పటికే వారి బిల్లును ఎవరో కట్టేశారని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. మొత్తం ఫుడ్‌ బిల్లును ఎవరో అజ్ఞాత వ్యక్తి చెల్లించి వెళ్లాడని తెలుసుకున్ని షాక్ అయ్యాడు సోనూ. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)

ఈ సంఘటనతో సోనూసూద్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బిల్లు కట్టిన వ్యక్తి సోనూ సూద్ అభిమాని అని తరువాత తెలిసింది. అంతే కాదు బిల్ కట్టిన సదరు అభిమాని ఓ చిన్న సందేశం కోసం పంపించాడు సోనూసూద్ కోసం. దేశం కోసం మీరు చేస్తున్న మంచి పనులకు నా తరపున చిన్న కృతజ్ఞత ఇది’ అంటూ ఓ నోట్‌ను రాసి వెళ్లాడు. ఈ విషయాన్ని సోనూసూద్‌ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించారు. ‘ఈ పని ఎవరు చేశారో తెలియదు కానీ..తను నా హృదయాన్ని గెలుచుకున్నాడు’ అంటూ సోనూ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios