Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో రాజమౌళిని కూడా దాటేసేలా ఉన్న అనిల్ రావిపూడి!

అనిల్ రావిపూడి ఎనర్జీ, స్పీడ్ చూస్తుంటే రాజమౌళి గుర్తొస్తున్నారు. ఒక విధంగా ఆయన్ని కూడా దాటిపోయేలా కనిపిస్తున్నాడు. ఇంతకీ అనిల్ రావిపూడి ఏ విషయంలో రాజమౌళికి పోటీ ఇస్తున్నాడో చూద్దాం... 
 

f3 director anil ravipudi reminds rajamouli in movie promotions
Author
Hyderabad, First Published May 21, 2022, 2:12 PM IST

ఎడారిలో కూడా ఇసుక అమ్మగలగడమే మార్కెటింగ్ సూత్రం. ఇలాంటి దిట్టలు బిజినెస్ రంగంలో మాత్రమే ఉంటారనుకుంటే పొరపాటు. క్రియేటివ్ ఫీల్డ్ లో కూడా మార్కెటింగ్ జీనియస్ లు ఉన్నారు. వాళ్లలో రాజమౌళి (Rajamouli) ఒకరు. ఆయన సినిమా ఎంత శ్రద్ధగా తెరకెక్కిస్తారో అంతకు మించి ప్రణాళికగా ప్రచారం చేస్తారు. ప్రమోషన్స్ లో సరికొత్త వ్యూహాలు రచిస్తారు. బాహుబలి 2 సక్సెస్ దీనికి బెస్ట్ ఉదాహరణ. ఫస్ట్ పార్ట్ సక్సెస్ అనంతరం రెండేళ్లు పార్ట్ 2 గురించి జనాలు మాట్లాడుకునేలా రాజమౌళి చేశారు. తన మార్కెటింగ్ టెక్నిక్స్ తో ఫస్ట్ పార్ట్ కి మూడు రెట్లు అధికంగా వసూళ్లు రాబట్టారు. 

ఆయన లేటెస్ట్ సెన్సేషన్ ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie)సక్సెస్ లో కూడా ప్రమోషన్స్ రోల్ చాలా ఉంది. ఈ మధ్య వరుస సక్సెస్ లు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి సైతం రాజమౌళి తలపిస్తున్నాడు. ఆయన ప్రమోషనల్ టెక్నిక్స్ , ఎనర్జీ చూస్తుంటే రాజమౌళి గుర్తొస్తున్నాడు. మే 27న ఎఫ్ 3 విడుదల నేపథ్యంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi)అలుపెరగకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు. వరుసగా బుల్లితెర కార్యక్రమాల్లో తన టీం తో పాటు దిగిపోతున్నాడు. అలాగే మీడియా సంస్థల ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. 

ఇక సినిమా కాన్సెప్ట్ కి సెట్ అయ్యేలా... మహిళామణులతో ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆడవాళ్లు హీరో వెంకీతో పాటు వరుణ్ ని ఓ ఆటాడుకున్నారు. గత వారం రోజులుగా అనిల్ రావిపూడి అసలు రెస్ట్ తీసుకోవడం లేదు. మరోవైపు దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ కల్పిస్తున్నారు. ఎఫ్ 3 (F3 Movie)టీం ప్రమోషన్స్ ఫుల్ సక్సెస్ అన్న మాట వినిపిస్తోంది. సినిమా జనాల్లోకి బాగా వెళ్ళింది. భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం కలదు. 

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఎటువంటి అదనపు రేట్లు ఉండవని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిణామం ఎఫ్ 3 వసూళ్లకు కలిసొచ్చే అంశం. 2019లో విడుదలైన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కుతుంది. వెంకటేష్-వరుణ్ లకు జంటగా తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు. కొత్తగా సునీల్, సోనాల్ చౌహాన్ ఎఫ్ 3 టీమ్ లో జాయిన్ అయ్యారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios