Asianet News TeluguAsianet News Telugu

కూలీలుగా కనిపిస్తోన్న F2 హీరోలు!

టాలీవుడ్ లో మల్టీస్టారర్ కథలు ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే నెక్స్ట్ వెంకటేష్ - వరుణ్ తేజ్ వారి స్టామినాను చూపించేందుకు రెడీ అవుతున్నారు. వీరు ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. 

F2 heroes latest still
Author
Hyderabad, First Published Nov 2, 2018, 10:02 PM IST

టాలీవుడ్ లో మల్టీస్టారర్ కథలు ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే నెక్స్ట్ వెంకటేష్ - వరుణ్ తేజ్ వారి స్టామినాను చూపించేందుకు రెడీ అవుతున్నారు. వీరు ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. పటాస్ - సుప్రీమ్ - రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఇద్దరి హీరోలను తనదైన శైలిలో చూపించనున్నాడు. 

సినిమాలో ఇద్దరు చేసే అల్లరి అంతా ఇంతా కాదట. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇకపోతే సినిమాకు సంబందించిన ఒక ఫొటోను దర్శకుడు అనిల్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. వెంకీ వరుణ్ మొహాలు చూపించలేదు గాని వారి చేతుల కున్న బ్యాచ్ లను చూపించారు. 

వెంకటేష్‌ కెరీర్ కి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచినా కూలీ నెం.1 ఫార్మాట్ లో  ఉన్న ఈ స్టిల్‌లో.. కూలీ నెం.786గా వరుణ్‌ - కూలీ నెం.1గా వెంకటేష్‌ లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో మెహ్రీన్ - తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios