Asianet News TeluguAsianet News Telugu

Bro Prerelease Event: తమన్ ని తమన్నా చేసేశావ్ గా బ్రో... టీజీ వెంకటేష్ స్పీచ్ పై పేలుతున్న ట్రోల్స్!

మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవ్వులు పూయించారు. ఆయనకు సినిమా పరిజ్ఞానం లేకపోవడంతో నటులు, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ పేర్లు ఇష్టం వచ్చినట్లు పలికారు. 

ex mp tg venkatesh funny speech in pawan kalyan tg venkatesh funny speech ksr
Author
First Published Jul 25, 2023, 10:17 PM IST

నేడు హైదరాబాద్ శిల్పకళా వేదికగా బ్రో ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, ఊర్వశి రాతెలా ఈవెంట్లో పాల్గొన్నారు. అలాగే చిత్ర దర్శకుడు సముద్ర ఖని, నిర్మాత టీజీ వెంకటేష్ సైతం హాజరయ్యారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, బ్రహ్మానందం ప్రత్యేక అతిథులుగా సందడి చేశారు. 

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కజిన్ మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వేదికపై మాట్లాడారు. ఆయనకు బ్రో మూవీ నటులు, సాంకేతిక నిపుణుల పేర్ల మీద కనీస ఆవాహన లేదు. ఆయన పొలిటికల్ లీడర్ కాగా సినిమాలు అసలు చూడరనే సందేహం కలుగుతుంది. వేదికపై ఒక్కరి పేరు సరిగా పలకలేదు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని తమన్నా అన్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ ని ధర్మ తేజ అన్నారు. 

ఇక కేతిక శర్మ అనబోయి కీర్తి శర్మ అన్నారు. దర్శకుడు సముద్రఖని పేరు సముద్రాలు అన్నారు. ఆయన స్పీచ్ దెబ్బకు వేదిక మీదున్న యాంకర్ సుమకు నవ్వు ఆగలేదు. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే  పెద్ద ఎత్తున గోల చేశారు. ఆయన స్పీచ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి. 

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో. ఈ సోషియో ఫాంటసీ సోషల్ డ్రామా విడుదలకు సిద్ధమైంది. జులై 28న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. బ్రో మూవీ తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని తెలుగులో కూడా తెరకెక్కించారు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. కథలో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఊర్వశి రాతెలా స్పెషల్ సాంగ్ చేశారు... 
 

Follow Us:
Download App:
  • android
  • ios