ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది హీరోయిన్ లయ. రకరకాల వీడియోలతో టాలీవుడ్ ప్రేక్షకులు దృష్టిని లాగేస్తోంది. డాన్స్ లు, రీమిక్స్ వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రీసెంట్ గా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను ప్యాన్స్ తో శేర్ చేసుకుంది బ్యూటీ. 

టాలీవుడ్ మాజీ హీరోయిన్లలో చాలా మంది ఫారెన్ లో సెటిల్ అయ్యారు. కొంత మంది ఫ్యామిలీలను చూసుకుంటుంటే..మరికొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉన్నారు. ఆకోవలోకే వస్తారు మాజీ హీరోయిన్ లయ. 

అచ్చ తెలుగు హీరోయిన్ ల‌య సిల్వ‌ర్ స్క్రీన్‌కు దూరం అయ్యి చాలా ఏళ్లు అవుతుంది. అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ అదరగోడుతోంది. నెట్టింట మాత్రం ఏదో అప్‌డేట్‌ ఇస్తూ.. ఫ్యాన్స్ కు ట‌చ్‌లో ఉంటుంది. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసే ఏదో ఒక ట్రాక్‌కు డ్యాన్స్ చేసి ఔరా అనిపిస్తుంటుంది ల‌య‌. కాలిఫోర్నియలో ఉంటున్న ఈ మాజీ హీరోయిన్ అక్కడ మన తెలుగు పాటలకు నెమలిలా నాట్యం చేస్తోంది. 

రీసెంట్ గా మ‌రో ట్రాక్‌కు యూఎస్ వీధుల్లో డ్యాన్స్ చేసింది లయ. అంద‌రి చూపు త‌న‌వైపు తిప్పుకుంది. అంతే కాదు లయ ఏ పాటకు డాన్స్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారంతా. రీసెంట్‌గా వ‌చ్చిన అంటే సుంద‌రానికి సినిమా ప్ర‌మోష‌న్ సాంగ్‌ కు స్టెప్పులేసింది సీనియర్ బ్యూటీ. అది కూడా యూ ఎస్ లోని యూనివ‌ర్స‌ల్ స్టూడియోస్ దగ్గర తన ఫ్రెండ్ తో కలిసి అదిరి పోయే డాన్స్ వేసి.. స్టెప్పులేసి అద‌ర‌హో అనిపించింది. 

ఈ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన లయ ఓ చిన్న నోట్ కూడా రాసింది. సిటీ వాక్‌-యూనివ‌ర్స‌ల్ స్డూడియోస్ వ‌ద్ద ట్రెండింగ్ ట్రాక్‌ను ప్ర‌య‌త్నించా అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. అటు లయ పాత ఫ్యాన్స్.. ఇప్పుడు కొత్త గా ఆడ్ అయిన ఫ్యాన్స్ కూడా ఆమె వీడియోకు వరుసగా కామెంట్లు,. లైక్ లతో ముంచెత్తుతున్నారు.