Asianet News TeluguAsianet News Telugu

వేలానికి శ్రీదేవి కట్టిన చీరలు, అతిలోక సుందరికి ఘన నివాళి ప్లానింగ్

అతిలోక సందరి శ్రీదేవి ఈ ప్రపంచాన్ని విడిచి నాలుగేళ్ళు దాటిపోయింది. అయినా ఆమె జ్ఞాపకాలు సినీ ప్రియులను వెంటాడుతూనే ఉన్నాయి.  ఆమె సినిమాలు చూసినప్పుడల్లా. బాధతో కన్నీరు కారుస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. ఇక  శ్రీదేవికి  బాలీవుడ్ లో ఘన నివాళి ప్లాన్ చేశారు.  ఏం చేయబోతున్నారంటే..?

english vinglish Movie sridevi sarees to be auctioned
Author
First Published Oct 4, 2022, 3:47 PM IST

అతిలోక సందరి శ్రీదేవి ఈ ప్రపంచాన్ని విడిచి నాలుగేళ్ళు దాటిపోయింది. అయినా ఆమె జ్ఞాపకాలు సినీ ప్రియులను వెంటాడుతూనే ఉన్నాయి.  ఆమె సినిమాలు చూసినప్పుడల్లా. బాధతో కన్నీరు కారుస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. ఇక  శ్రీదేవికి  బాలీవుడ్ లో ఘన నివాళి ప్లాన్ చేశారు.  ఏం చేయబోతున్నారంటే..?

శ్రీదేవి అంటే ఇష్టపడని సినిమా ప్రియులు ఉండరు. ఆమె కోసం పడిచచ్చే అభిమానులు కో కొల్లలుగా ఉన్నారు. ఇప్పటికీ ఆమెను తలుచుకని బాధపడుతుంటారు. ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఆమె వారసత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. వరుస సినిమాలతో స్టార్ గా బాలీవుడ్ ను ఏలే ప్రయత్నం చేస్తోంది. ఇక  బాలీవుడ్ లో శ్రీదేవి కోసం ఘన నివాలి ప్లాన్ చేశారు ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీ టీమ్.  

 కొన్నేళ్ల పాటు సౌత్ తో పాటు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి బోనీ కపూర్ తో పెళ్లి తరువాత.. కుటుంబ బాధ్యతలపై పడిపోయింది. దాంతో  1997 లో సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది అతిలోక సుందరి.ఇక ఆమె మళ్లీ సినిమాల్లోకి రాదు అనుకుంటున్న టైమ్ లో .. తిరిగి 2012 లో ఇంగ్లిష్-వింగ్లిష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో సగటు గృహిని పాత్రలో శ్రీదేవి మరోసారి అభిమానులను అలరించింది. ముఖ్యంగా.. చీరకట్టులో నటి శ్రీదేవి అందాన్ని వర్ణించలేం. దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానుల మనసు గెలుచుకున్న శ్రీదేవి.. ఇంగ్లిష్ వింగ్లిష్ లో చీరకట్టుతో అద్భుతం సృష్టించింది. 

ఇక ఇంగ్లిష్ వింగ్లిష్  సినిమా రిలీజ్ అయ్యి అక్టోబర్ 10తో పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ మూవీ టీమ్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇంగ్లిష్ వింగ్లిష్  సినిమా డైరెక్టర్ గౌరీ షిండే  ప్రత్యేకంగా ఏదో  ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా శ్రీదేవి చీరను కూడా వేలానికి ఉంచబోతున్నట్టు సమాచారం. 

ఈ సినిమా పదేళ్ల వేడుకను నిర్వహించడంతోపాటు, ఇంగ్లిష్ వింగ్లిష్ లో శ్రీదేవి  కట్టిన అన్ని  చీరలను వేలం వేయాలని టీమ్ నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని డైరెక్టర్  గౌరీ షిండే స్వయంగా ప్రకటించారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నారు. ఈ విషయాలను దర్శకురాలు గౌరీ షిండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. ఇంగ్లిష్ వింగ్లిష్ లో సగటు ఇల్లాలిగా, ఇంగ్లింష్ ప్రావీణ్యం లేని పాత్రలో శ్రీదేవి నటించి మెప్పించింది. ఇంగ్లిష్ నేర్చుకోవడం కోసం ఆమె పడే  ఇబ్బందులు ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు మేకర్స్. చాలా మంది గృహిణులకు ఆదర్శంగా నిలిచింది సినిమా. 

Follow Us:
Download App:
  • android
  • ios