Asianet News TeluguAsianet News Telugu

లేడీ ఓరియెంటెడ్ కథలో ఈషాకి ఛాన్స్!

తెలుగమ్మాయి ఈషా రెబ్బకి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రావడం లేదు. హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు.

Eesha rebba Opts Lady Oriented Movie
Author
Hyderabad, First Published Apr 3, 2019, 3:53 PM IST

తెలుగమ్మాయి ఈషా రెబ్బకి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రావడం లేదు. హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఆమెకి సైడ్ క్యారెక్టర్లు మాత్రమే వస్తున్నాయి. 

దీంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పెడుతూ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. 

గతంలో 'అదిరిందయ్యా చంద్రం'.. 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్' , 'ఢమరుకం' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీనివాసరెడ్డి 'మామ మంచు అల్లుడు కంచు' సినిమా ఫ్లాప్ దెబ్బతో ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

తన గత చిత్రాలకు భిన్నంగా థ్రిల్లర్ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇది ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా అని సమాచారం. ఇందులో ప్రధాన పాత్రలో ఈషా రెబ్బాని ఎంపిక చేశారు. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాతో శ్రీనివాసరెడ్డి సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios