Asianet News TeluguAsianet News Telugu

ఈషా రెబ్బా తో విశ్వక్ సేన్ రొమాన్స్.. మాస్ కా దాస్ ప్లాన్ మూమూలుగా లేదుగా..?

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బతో రొమాన్స్ చేయబోతున్నాడు మాస్ హీరో విశ్వక్ సేన్. అవును మాస్ కా దాస్ తాజా సినిమాలో ఈషా సందడి చేయబోతుందట. ఇంతకీ వివరాలేంటంటే..? 

Eesha Rebba Item Song In Vishwak Sen Gangs Of Godavari Movie JMS
Author
First Published Jan 24, 2024, 10:20 PM IST | Last Updated Jan 24, 2024, 10:20 PM IST

ఈ సారి సినిమాల  సీజన్ లో గుంటూరు కారం తప్పించి పెద్దగా ఊపిచ్చిన ఐటమ్ సాంగ్ లేదు.. దాంతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా భారీ ప్లాన్ వేశాడట యంగ్ హీరో.   మాస్ దా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేస్తున్నాడు.ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మరో స్టార్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్ లో కనిపించబోతోంది. ఇక  ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి డెల్టా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. ఇప్పటికే ఇద్దరు  హీరోయిన్లు సందడి చేయబోతున్నారు. 

ఇక  ఈసినిమాలో ఇప్పుడు మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా జాయిన్ అవ్వబోతోందట. అయితే ఈషా రెబ్బ మాత్రం ఫుల్ లెన్త్ పాత్రలో కనిపించడం లేదు..ఈషా ఈమూవీలో ఐటమ్ సాంగ్ చేయనుంది. అవును ఓ మాస్ మసాలా పాటకు విశ్వక్ తో కలిసి స్టెప్పులేయబోతోందట. అదిరిపోయే ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా మరో రెండు రోజుల్లోనే  జరగనుందట. అసలే ఈ సినిమాపై మాస్ ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇక ఇప్పుడు స్పెషల్ సాంగ్ తోడైతే హైప్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.

ఈమూవీపై రాను రాను అంచనాలు పెరిగిపోతున్నాయి. అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి  సినిమాను గతేడాది డిసెంబర్ లో రిలీజ్ చేద్దామని సన్నాహాలు చేసుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల మూవీ రిలీజ్ ను లాంగ్ టైమ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. సంక్రాంతి సీజన్ ప్రభావం అయిపోయిన తరువాత, శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.  

ఈ విషయాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్‌తో పాటు సుట్టంలా సూసి అనే ఫ‌స్ట్ సింగిల్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మిస్తుండగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్లను మేకర్స్ స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios