చాలా మంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, పలానా దర్శకుడు, నిర్మాత, హీరో వేధించారని మీడియా ముందుకొచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే కొందరు సీనియర్ హీరోయిన్లు మాత్రం అలాంటిదేమీ లేదని ఇండస్ట్రీ గురించి గొప్పగా మాట్లాడారు.

తాజాగా నటి ఈషా రెబ్బ కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.  తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈషాకి హీరోయిన్ గా సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు. కానీ తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా..? అని ఆమెని ప్రశ్నించగా.. తడుముకోకుండా 'ఎస్' అని సమాధానం చెప్పింది. అన్ని రంగాల్లో ఉన్నట్లే సినిమా ఇండస్ట్రీలో కూడా రెండు రకాల వ్యక్తులు ఉన్నారని, ఇక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పుకొచ్చింది. అయితే దీన్ని ఎదుర్కోవడానికి ఓ టెక్నిక్ ఫాలో అవుతుంటానని వెల్లడించింది.

అదేంటంటే.. తనకు ఇబ్బందిగా అనిపించే పరిస్థితులు, మనుషులు ఎదురైతే అక్కడ నుండి తప్పుకుంటానని తెలిపింది. అలానే పక్కవారికి ఇబ్బంది కలగకుండా నో చెప్పడం నేర్చుకున్నానని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ కన్నడ సినిమా సైన్ చేసింది. త్వరలోనే కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.