బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది.  ప‌లు కేసుల్లో నిందితుడైన‌ సుఖేష్‌ చంద్రశేఖర్‌ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ప‌లు కేసుల్లో నిందితుడైన‌ సుఖేష్‌ చంద్రశేఖర్‌ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి జాక్వెలిన్‌ను చెందిన రూ. 7.27 కోట్లను ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరుతో ఉన్న రూ.7.12 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈడీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. తొలుత జాక్వెలిన్ ఆస్తులు అటాచ్ చేయబడ్డాయి. అయితే ఈ కేసులో ఆమెను నిందితురాలిగా చేయడంపై అధికారులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. దీంతో జాక్వెలిన్‌ మరిన్ని కష్టాల ఎదుర్కొనేలా కనిపిస్తోంది. 

దాదాపు రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. సుఖేష్ బాలీవుడ్‌ హీరోయిన్లు జాక్వెలిన్‌, నోరాకు ఖరీదైన బహుమతులు ఇచ్చాడని ప్ర‌చారం సాగింది. సుకేశ్ చంద్రశేఖర్.. తాను దోచుకున్న డబ్బును ఉపయోగించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు 5.71 కోట్ల రూపాయల విలువైన బహుమతులు ఇచ్చినట్లు అధికారులు ఇప్పటివరకు ఆధారాలను ఈడీ కనుగొంది. మ‌రోవైపు జాక్వెలిన్ స‌న్నిహిత బంధువుల‌కు 1.7 ల‌క్ష‌ల యూఎస్ డాల‌ర్లు, 27, 000 ఆస్ట్రేలియ‌న్ డాలర్లు ఇచ్చాడ‌ని చెబుతున్నారు.

రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌కు బెయిల్‌ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్‌ చేశాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌. ఆ తర్వాత బెయిల్‌ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్‌ సింగ్‌ భార్య అదితి సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్‌‌ను అరెస్ట్‌ చేశారు. 

సుకేశ్ చంద్రశేఖర్‌ను ఈడీ కస్టడీలో విచారించినప్పుడు.. అతడు జాక్వెలిన్ గురించి అతను పలు విషయాలు వెల్లడించాడు. ఆ తర్వాత జాక్వెలిన్, సుకేశ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ద‌ర్యాప్తులో భాగంగా జాక్వెలిన్‌ ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణకు హాజరైంది. ఈ విచారణలో సుకేశ్‌కు జాక్వెలిన్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలింది.