గతేడాది 'కవచం' సినిమాకి సంబంధించిన ఒక వేడుకలో కాజల్ ని పబ్లిక్ గా ముద్దాడి విమర్శలు ఎదుర్కొన్నాడు ఛోటా కే నాయుడు. అప్పటికే ఇండస్ట్రీలో ఛోటాకి అమ్మాయిలపై ఇంటరెస్ట్ ఎక్కువనే కామెంట్స్ వినిపించేవి. ఈ విషయంపై ఛోటా కూడా చాలా ఓపెన్ గా మాట్లాడేవాడు. 

అయితే ఛోటా.. కాజల్ ని ముద్దుపెట్టుకున్న సమయంలో ఆమె హుందాగా ప్రవర్తించినప్పటికీ ఆమె అభిమానులు మాత్రం ఊరుకోలేదు. సోషల్ మీడియా వేదికగా ఛోటా ఏకిపారేశారు. అప్పటినుండి కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తోన్న ఛోటా తాజాగా మరోసారి విమర్శకుల చేతికి చిక్కాడు.

ఇటీవల జరిగిన 'రాజు గారి గది3' సినిమా ప్రారంభోత్సవ వేడుకలో ఛోటా.. తమన్నాతో ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ ఈవెంట్ లో ఫోటోలకు ఫోజిచ్చే సమయంలో దూరంగా ఉన్నవాడు తమన్నా పక్కకు చేరి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు.

తమన్నా తన చేతిని విడిపించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా.. ఆయన గట్టిగా అలానే పట్టుకోవడం వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో ఛోటాని టార్గెట్ చేసిన నెటిజన్లు అతడిపై  మండిపడుతున్నారు. పబ్లిక్ లో ఎలా ప్రవర్తించాలో తెలియదా అంటూ విరుచుకుపడుతున్నారు. ఛోటా ఇలానే గనుక కంటిన్యూ అయితే ఆయన కెరీర్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది!