బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. ఇప్పటివరకు చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో కలిసి నటిస్తోన్న ఈ బ్యూటీకి ఫైనల్ గా బ్రేక్ వచ్చింది. 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. 'భారత్' సినిమాలో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇటీవల సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా సినిమాలో ఓ పాటను విడుదల చేశారు. ఈ పాటలో దిశా తన నడుము ఒంపులతో కుర్రకారులో హీట్ పెంచేసింది.

సోషల్ మీడియాలో ఆమె ఒక ఫోటో పెడితేనే లక్షల కొద్దీ లైకులు వస్తుంటాయి. అలాంటిది స్లో మోషన్ లో ఆమె నటించిన హాట్ సాంగ్ రిలీజ్ అయ్యేసరికి యూత్ ఎగబడి చూస్తోంది.  ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. ఒక్కరోజులో ఈ పాటకి రెండుకోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.