Asianet News TeluguAsianet News Telugu

నితిన్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి..!

నితిన్ నటిస్తోన్న కొత్త సినిమాలో కనిపించాలని ఉందా..? అయితే మూడు లక్షలు కట్టి మీ కల నిజం చేసుకోండి అంటూ ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పడింది. 

director venky kudumula about fake casting call
Author
Hyderabad, First Published Feb 4, 2019, 1:49 PM IST

నితిన్ నటిస్తోన్న కొత్త సినిమాలో కనిపించాలని ఉందా..? అయితే మూడు లక్షలు కట్టి మీ కల నిజం చేసుకోండి అంటూ ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పడింది. అందులో సభ్యుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.

దీంతో విషయం చిత్రబృందం వరకూ వెళ్లింది. దీంతో స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల తన దర్శకత్వంలో నితిన్ చేయబోయే 'భీష్మ' సినిమాలో అవకాశం ఇస్తామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు.

ఆ వాట్సాప్ గ్రూప్ తో చిత్రబృందానికి ఎలాంటి సంబంధం లేదని, డబ్బులు కట్టి మోసపోవద్దని వెల్లడించాడు. అటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే చిత్రయూనిట్ కాస్టింగ్ కాల్ ప్రకటన చేస్తుందని స్పష్టం చేశారు.

అలానే ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుందనే విషయాన్ని దర్శకుడు ఖండించాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలు చెబుతామని అన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios