కాజల్ కి భయపడిన హీరోలు!

First Published 16, May 2019, 6:47 PM IST
director teja comments on tollywood heroes
Highlights

అందంలో చందమామ అని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్ అగర్వాల్. ఆమె పక్కన నటించడానికి ఏ హీరో అయినా ఇష్టపడతాడు. కథ నచ్చితే ఎలాంటి పాత్రలకైనా ఒకే చెప్పే బేబీ 'సీత' సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. 

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ సినిమాలో కాజల్ పక్కన నటించడానికి బెల్లంకొండ కంటే ముందు కొంత మంది హీరోలను కలిసినప్పుడు వారు నటించమని తెగేసి చెప్పారట. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ ఈ విషయాన్ని చెప్పాడు. 

కాజల్ కాకుండా ఇంకెవరైనా ఈ కథలో నటిస్తే.. వెంటనే ఒప్పుకుంటామని చెప్పారట. అయితే సీత కథను ముందే కాజల్ కోసమని దర్శకుడు ఫిక్స్ అవ్వడంతో ఆమెను మార్చలేక హీరోలని మార్చేశాడు. కాజల్ పక్కన నటించడానికి యువ హీరోలు కొంత మంది భయపడటం నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా కథలో అమ్మడి డామినేషన్ ఎక్కువగా ఉంటుందట. మరి ఆ డామినేషన్ ఎంతవరకు క్లిక్కవుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

loader