ఫిదా మూవీ విడుదలై మూడేళ్లు దాటిపోయింది. ఆ మూవీ జ్ఞాపకాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను వీడలేదు. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులు దోచేసింది. మరి ఇన్నాళ్లకు ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. 

నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ తెలియజేశారు. షూటింగ్ లొకేషన్ నుండి శేఖర్ కమ్ముల, సాయి పల్లవి మరియు శేఖర్ మాస్టర్ కూర్చుని ఉన్న ఫోటో షేర్ చేశారు. 

ఇక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు విశేష ఆదరణ దక్కింది. ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి లుక్ చూస్తుంటే మిడిల్ క్లాస్ కి చెందిన అబ్బాయి, అమ్మాయిలా ఉన్నారు. ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందిస్తున్నారు.