Asianet News TeluguAsianet News Telugu

106 ఏళ్ళ వయసులో ఎలా సాధ్యం.. భారతీయుడు 2పై రిపోర్టర్ ప్రశ్న, శంకర్ సమాధానం అదిరిపోయిందిగా

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 జూలైలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 28 ఏళ్ళ తర్వాత శంకర్ భారతీయుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ట్రైలర్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది.

Director Shankar gives reply to reporter regarding kamal haasan role in Indian 2 dtr
Author
First Published Jun 27, 2024, 10:53 PM IST

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 జూలైలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 28 ఏళ్ళ తర్వాత శంకర్ భారతీయుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ట్రైలర్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది. భారతీయుడిగా కమల్ హాసన్ చేసే విన్యాసాలని చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఈ చిత్రంలో హీరో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రిపోర్టర్ డైరెక్టర్ శంకర్ కి ఒక ప్రశ్న సంధించారు. 

భారతీయుడు మొదటి భాగంలో చూపించిన దానిప్రకారం సేనాపతి 1918లో జన్మించారు. అంటే ఆయన వయసు ఇప్పుడు 106 ఏళ్ళు. ఈ వయసులో అలాంటి విన్యాసాలు చేస్తే నమ్మశక్యంగా ఉంటుందా అని రిపోర్టర్ ప్రశ్నించారు. 

దీనికి శంకర్ సమాధానం ఇస్తూ.. చైనాలో 'లు జిజియాన్' అనే మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వృద్ధుడు ఉన్నారు. జిజియాన్ మాస్టర్ వయసు 120 ఏళ్ళు. ఇప్పటికీ ఆయన ఎగిరి తన్నగలరు. ఈ చిత్రంలో సేనాపతికి కూడా మర్మకళ తెలుసు. సేనాపతి ధ్యానం, యోగ చేస్తారని చూపించాం. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు వయసుతో సంబంధం లేదు అని శంకర్ తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios