Asianet News TeluguAsianet News Telugu

ప్రభుదేవా సాంగ్ కి రాజమౌళి స్టెప్స్... వీడియో వైరల్


దర్శకుడు రాజమౌళి తనలోని మరో టాలెంట్ చూపించాడు. ప్రభుదేవా సాంగ్ కి దుమ్ము రేపే స్టెప్స్ వేశాడు. రాజమౌళి దంపతుల డాన్స్ వీడియో వైరల్ అవుతుంది. 
 

director rajamouli steps to prabhudeva song dance video viral ksr
Author
First Published Apr 1, 2024, 4:29 PM IST

రాజమౌళి భార్య రమా రాజమౌళితో పాటు ఓ వేడుకకు హాజరయ్యాడు. ఈ ప్రైవేట్ ఈవెంట్లో భార్య రమా తో కలిసి రాజమౌళి డాన్స్ వేశాడు. ప్రభుదేవా హీరోగా నటించిన ప్రేమికుడు చిత్రంలోని 'అందమైన ప్రేమరాణి చేయితగిలితే' సాంగ్ కి ఆయన స్టెప్స్ వేశారు. రాజమౌళి వీడియో వైరల్ గా మారింది. దర్శకధీరుడిలో ఈ టాలెంట్ కూడా ఉందా... అని జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా రాజమౌళికి నటనలో కూడా ప్రావీణ్యం ఉంది. కొన్ని చిత్రాల్లో ఆయన గెస్ట్ రోల్స్ చేశాడు. తన చిత్రాల్లో నటించే నటులకు ఆయన ప్రతి సన్నివేశం నటించి చూపుతాడట. దాని వలన సదరు నటులకు ఈజీ అవుతుందట. కాగా నెక్స్ట్ రాజమౌళి మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ 29వ చిత్రానికి పని చేస్తున్నాడు.  స్క్రిప్ట్ పూర్తి అయినట్లు ఇటీవల రాజమౌళి వెల్లడించారు. స్క్రిప్ట్ తుది దశకు వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయని రాజమౌళి మీడియాతో చెప్పాడు. ఎస్ఎస్ఎంబి 29 చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. స్క్రీన్ ప్లే రాజమౌళి తన టీమ్ తో కలిసి సిద్ధం చేశారు.

ఎస్ఎస్ఎంబి 29 పాన్ వరల్డ్ మూవీ అని చెప్పొచ్చు. ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి ఇమేజ్ ప్రపంచ దేశాలకు పాకింది. దీంతో ఆయన హాలీవుడ్ రేంజ్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్నారు. మహేష్ కి సెట్ అయ్యేలా జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే యోధుడిలా కనిపిస్తాడట. ఇండియానా జోన్స్ తరహాలో ఈ చిత్రం ఉంటుందని రాజమౌళి నేరుగా చెప్పడం విశేషం. 

రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఎస్ఎస్ఎంబి 29 తెరకెక్కనుంది. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. రాజమౌళి ఏళ్లుగా కొనసాగిస్తున్న తన టీమ్ లో కూడా మార్పులు చేశాడని తెలుస్తుంది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మహేష్ ని రాజమౌళి సరికొత్తగా చూపించనున్నారట. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios