Asianet News TeluguAsianet News Telugu

గబ్బర్ సింగ్ డైరెక్టర్ కౌంటర్.. టీడీపీకేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ పాలిటిక్స్ లపై ఊహించని విధంగా స్పందించారు. పాలిటిక్స్ సినిమాను పంచ్ లైన్స్ తో కొట్టేస్తున్నాయని ఎపి రాజకీయాలను ఉద్దేశించి సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ హరీష్ ను క్లారిటి అడుగుతున్నారు. 

director harish shankar counter on ap politics
Author
Hyderabad, First Published Apr 3, 2019, 6:17 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ పాలిటిక్స్ లపై ఊహించని విధంగా స్పందించారు. పాలిటిక్స్ సినిమాను పంచ్ లైన్స్ తో కొట్టేస్తున్నాయని ఎపి రాజకీయాలను ఉద్దేశించి సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ హరీష్ ను క్లారిటి అడుగుతున్నారు. 

పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేసిన హరీష్ చాలా సార్లు 'కట్టే కాలే వరకు నేను పవన్ ఫ్యానే' అనే డైలాగ్ తో క్లారిటీ ఇస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు టిడిపి కి సంబందించిన పోస్టర్ ని పోస్ట్ చేయడంతో స్టార్ డైరెక్టర్ ఫ్యాన్స్ కి ఫజిల్ వదిలినట్లు టాక్ వస్తోంది. 

హరీష్ చేసిన కామెంట్ విషయానికి వస్తే..  ప్రస్తుతం రాజకీయా పార్టీలకు సంబందించిన యాడ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే స్లొగన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి.  ప్రాసలు పంచ్ లైన్ లతో నేతలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. టీడీపీ కి సంబందించిన ఒక ఫోటోని హరీష్ శంకర్ పోస్ట్ చేస్తూ పంచ్ లైన్ లతో పాలిటిక్స్ సినిమాను బీట్ చేస్తున్నాయంటూ.. ఇందులో అదొక్కటని కామెంట్ చేశారు. 

హరీష్ ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేస్తున్నాడా? లేకా టీడీపీకి ప్రమోషన్స్ చేస్తున్నాడా అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఎవరికీ సపోర్ట్ చేస్తున్నారు టీడీపీకా? లేక జనసేనకా? అని జనసేన ఫాలోవర్స్ కూడా దర్శకుడి నుంచి సమాధానం కోరుతున్నారు. మరి ఈ పవన్ ఫ్యాన్ ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios