Asianet News TeluguAsianet News Telugu

రవితేజ కొత్త లుక్.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్!

పెరుగుతున్న టెక్సాలజీ సినీ రంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. ఇప్పటికే పైరసీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ పరిశ్రమకు, ఇప్పుడు మొబైల్స్‌, యాప్స్‌ వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా రవితేజ చేస్తున్న డిస్కోరాజా సినిమస్ను ఫేస్‌ యాప్‌ ఇబ్బందుల్లో పడేసింది. 

director clarity on raviteja's new look
Author
Hyderabad, First Published Aug 25, 2019, 12:41 PM IST

తాజాగా రవితేజ నటిస్తోన్న 'డిస్కో రాజా' చిత్రం కొత్త లుక్ ట్రై చేశాడంటూ లైట్ గెడ్డంతో ఉన్న ఆయన ఫోటో బయటకి వచ్చింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోయింది. సినిమాలో ప్లాష్ బ్యాక్ లో ఈ లుక్ లో రవితేజ కనపడుతున్నాడంటూ కథనాలు ప్రచురించారు. 

పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తున్న ఈ ఫోటోపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. అయితే ఈ ఫోటో ఫేక్ అని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ఫోటో అఫీషియల్‌ కాదని, త్వరలోనే అధికారిక ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తామని దర్శకుడు వీఐ ఆనంద్‌ వెల్లడించారు.

నేల టికెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రిభిన‌యం పోషించ‌నున్నాడ‌ట. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది . అయితే ముగ్గురు హీరోయిన్లుకు ప్రాధాన్యం వున్న ఈ చిత్రంలో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నాబా నటేష్ ను మరొక హీరోయిన్ గా ఎంపిక చేశారు.

మ‌రో హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 భామ పాయ‌ల్‌ని ఎంపిక చేశారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios