యంగ్‌ హీరో కార్తికేయ, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా’. గీతాఆర్ట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి భర్త కోల్పోయిన వితంతువుగా కనిపించింది. హీరో కార్తికేయ మార్చురీ వ్యాన్  డ్రైవర్ గా పని చేస్తుంటారు. వీరిద్దరి మధ్య చోటుచేసుకునే ఒక విచిత్రమైన ప్రేమకథా నేపథ్యంలో చావు కబురు చల్లగా సినిమా తెరకెక్కింది. 

ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమాల్లో ఒక‌టి చావు క‌బురు చ‌ల్లగా ఒకటి. గీతా ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సినిమా రావ‌టంతో ఈ సినిమాపై భారీ అంచానాలున్న‌ప్ప‌టికీ, అనుకున్న స్దాయిలో ఓపినింగ్స్ తెచ్చుకోలేకపోయింది. దానికి తగినట్లుగానే మార్నింగ్ షో నుండే ప్లాప్ టాక్ మూట కట్టుకుంది. భ‌ర్త మ‌ర‌ణించిన దుఃఖంలో ఉన్న ఆమెకు ల‌వ్ ప్ర‌పొజ్ చేయ‌టం కొత్తగా అనిపించినా ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు,, త‌ల్లి కొడుకులు క‌లిసి మందుకొట్టం వంటివి,తల్లి అక్రమ సంభందం వంటివి ప్రేక్ష‌కుల‌ను క‌న్విన్స్ చేయ‌లేక‌పోయాయి.

 అయితే ఇప్పుడు విషయం అది కాదు. ఈ సినిమా నివాసి అనే షార్ట్ ఫిల్మ్ కు కాపీ అంటూ ఓ టాపిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ విషయాన్ని ఓ నెట్ జన్ ..ఆ డైరక్టర్ నే స్వయంగా అడిగారు. అయితే ఆ దర్శకుడు ముందు దగ్గరలోని థియేటర్ కు వెళ్లి సినిమా చూడమని, ఆ తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే..తన స్టోరీ రిజిస్ట్రేషన్ డేట్, టైమ్,స్టాంప్ వంటివి అడగమని సమాధానమిచ్చారు. 

 ఇక నివాసీలో హీరో కాటి కాప‌రి. స్మ‌శాన‌వాటిక‌లోనే నివాసం. చావు క‌బురు చ‌ల్ల‌గాలో మాత్రం శ‌వాల‌ను తీసుకెళ్లే వ్యాన్ డ్రైవ‌ర్. నివాసీలోనూ త‌ల్లి-కొడుకు మందు కొడుతుంటారు. నివాశీలో ..తాత‌ను కోల్పోయిన దుఃఖంలో ఉన్న మ‌నువ‌రాలిని ప్రేమిస్తాడు. సినిమాలోనూ… హీరో ఇలానే హీరోయిన్ ని చావింట చూస్తాడు.ఈ రెండూ చూపించి నివాసీని కాపీ కొట్టేశార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఇక ఈ చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే..‘చావు కబురు చల్లగా’ చిత్రానికి 13.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 13.7కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి రోజు ఈ చిత్రం కేవలం 1.67కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 12.03 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ గట్టిగా రాబడితే తప్ప.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి.