Asianet News TeluguAsianet News Telugu

F2 అనిల్.. బాలయ్యనా మహేషా?

F2 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండటంతో మనోడికి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ ఖర్చిఫ్ వేశాడు. అలాగే మహేష్ కూడా సైగ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

DIRECTOR ANIL NEXT MOVIE BALAYYA OR MAHESH
Author
Hyderabad, First Published Jan 19, 2019, 12:57 PM IST

హిట్టందుకున్న దర్శకుడి కోసం స్టార్ హీరో అయినా వేచి చూడక తప్పదు. ఇప్పుడు అనిల్ రావిపూడి కోసం స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు. F2 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండటంతో మనోడికి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ ఖర్చిఫ్ వేశాడు. అలాగే మహేష్ కూడా సైగ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అనిల్ ఎటువైపు వెళతాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

F2 సినిమాతో వెంకటేష్ - వరుణ్ లకు మర్చిపోలేని హిట్టిచ్చిన అనిల్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇటీవల బాలకృష్ణ నుంచి అయితే ఓ కాల్ వెళ్లింది. అప్పుడెప్పుడో అనిల్ బాలయ్యతో రామారావు గారు  అనే ఓ సినిమా చేద్దామని అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఇప్పుడు బాలయ్య ఆ స్క్రిప్ట్ చేద్దామని చెప్పినట్లు సమాచారం. 

ఇక మహేష్ ఇటీవల F2 బావుందని సినిమాపై పాజిటివ్ గా స్పందించిన సంగతి తెలిసిందే. దర్శకుడికి ఫోన్ చేసి మంచి స్క్రిప్ట్ ఉంటే రెడీ చేయమని మహేష్ అనిల్ కి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ తరువాత సుకుమార్ తో కలవనున్నారు. ఈ లోపు అనిల్ స్క్రిప్ట్ రెడీ చేస్తే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ బాలకృష్ణ కూడా అనిల్ తో చేయాలనీ అనుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరి హీరోల్లో అనిల్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios