కన్నడ దర్శకుడు ఏఆర్ బాబు(56) ఈరోజు(బుధవారం) ఉదయం బెంగుళూరులో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయన ఈరోజు కన్నుమూశారు. 

ఆయనకి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. హలో యమ, కాసు ఇద్దవనె బాసు, యారదో దుడ్డు ఎల్లమ్మనె జాతరె, రి స్వల్ప బర్తిరా, ఆగోదెల్లా ఒళ్ళెయదక్కెఇలా 25 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు ఆర్.చెన్నేగౌడ, నిర్మాతల సంఘం అధ్యక్షుడు డా. నాగేంద్రప్రసాద్ లు ఘనంగా నివాళులు అర్పించారు.